* ప్రమాణ స్వీకారం వేళ.. లోక్సభలో రగడ
* చివరలో జై పాలస్తీనా అనడంపై అభ్యంతరం
* నిరసన వ్యక్తం చేసిన బీజేపీ కూటమి సభ్యులు
* జై భద్రకాళి అన్న కడియం కావ్య
ఆకేరున్యూస్ డెస్క్ : లోక్సభలో (Lok Sabha) రెండో రోజు తెలంగాణ ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కడియం కావ్య, చామల కిరణ్కుమార్ రెడ్డి, మల్లురవి, రామసహాయం రఘురాంరెడ్డి తదితరులు ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. కొందరు ఎంపీలు తెలుగులో ప్రమాణ స్వీకారం చేయగా, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) ఉర్దూలో ప్రమాణం చేశారు. ప్రమాణం చివరలో.. జై భీమ్.. జై తెలంగాణ, జై పాలస్తీనా, అల్లా హో అక్బర్.. అని అసద్ పేర్కొన్నారు. ఇందులో జై పాలస్తీనా అనడంపై బీజేపీ కూటమి సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. నిరసనకు సిద్ధమయ్యారు. ప్రొటెం స్పీకర్ కలుగజేసుకుని అసద్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తామని చెప్పడంతో సభ్యులు శాంతించారు. కాగా వరంగల్ ఎంపీ కడియం కావ్య (Kadiyam Kavya)ప్రమాణం చివరలో జై భద్రకాళి అని, భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్ రెడ్డి జై యాదగిరి లక్ష్మీనరసింహస్వామి తమ ప్రాంత దైవాలను స్మరించారు.
————————-