Telangana Apprenticeship Job Mela
* రేపటి నుంచి అప్రెంటిస్‌షిప్ కమ్ జాబ్ మేళా..
* ఎంపికైతే నెలకు రూ.9,600 స్టైపెండ్!
* ఫ్రెషర్లకు మంచి అవకాశం
ఆకేరు న్యూస్, హైదరాబాద్: నిరుద్యోగ యువతకు, వృత్తి విద్య పూర్తి చేసిన విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యాశాఖ శుభవార్త చెప్పింది. రీజినల్ డైరెక్టరేట్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంట్రప్రెన్యూర్షిప్ (RDSDE)సహకారంతో రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో అప్రెంటిస్‌షిప్ కమ్ జాబ్ మేళా నిర్వహించనుంది.
‘యువర్ స్కిల్స్.. యువర్ ఫ్యూచర్.. అవర్ మిషన్’ అనే నినాదంతో స్కిల్ ఇండియా మిషన్, నేషనల్ అప్రెంటిస్‌షిప్ ప్రమోషన్ స్కీమ్ (NAPS) కింద ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు.
* ఏమేం అవకాశాలు?
* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.9,600 స్టైపెండ్
* కెరీర్ కౌన్సెలింగ్
* ఆన్ ది స్పాట్ షార్ట్‌లిస్టింగ్
* వివిధ సంస్థల్లో అప్రెంటిస్‌షిప్ అవకాశాలు
* ఎవరు అర్హులు?
* 2023-2026 బ్యాచ్‌లకు చెందిన వృత్తి విద్య (Vocational) విద్యార్థులు
* మార్చి/జూన్ 2026లో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన ఫ్రెషర్లు
* గత మూడేళ్లలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు
* ఇంతకుముందు ఎక్కడా అప్రెంటిస్‌షిప్ చేయని వారు మాత్రమే అర్హులు
* ఇంటర్వ్యూల సమయం
* ఉదయం: పారామెడికల్ విభాగం అభ్యర్థులకు
* మధ్యాహ్నం: నాన్-పారామెడికల్ విభాగం అభ్యర్థులకు
* జాబ్ మేళా షెడ్యూల్
* జులై 6: ఎస్పీఎమ్ ప్రభుత్వ వృత్తి జూనియర్ కళాశాల, కుత్బుల్లాపూర్, మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా
* జులై 7: కస్తూరిబా గాంధీ జూనియర్ కళాశాల, మారేడ్‌పల్లి, సికింద్రాబాద్
* జులై 13: ప్రభుత్వ వృత్తి జూనియర్ కళాశాల, హన్మకొండ
* జులై 14: ప్రభుత్వ వృత్తి జూనియర్ కళాశాలలు, మహబూబ్‌నగర్ మరియు నల్గొండ
—————-
Please tell us what is wrong. Your report will be sent to the website team.
