Eluru Train Accident Tragedy
* రైలును ఢీకొని నలుగురు మృతి
* చేబ్రోలు రైల్వే స్టేషన్ సమీపంలో విషాదం..
* మృతుల్లో ముగ్గురు మహిళలు, ఓ యువకుడు
ఆకేరు న్యూస్, డెస్క్: ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లాలో శనివారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఉంగుటూరు మండలం చేబ్రోలు రైల్వే స్టేషన్ సమీపంలో చర్లపల్లి-షాలీమార్ ఎక్స్ప్రెస్ రైలు ఢీకొని నలుగురు దుర్మరణం చెందారు.
మృతుల్లో ముగ్గురు మహిళలు, ఒక యువకుడు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. ప్రమాదానికి గల కారణాలు, మృతుల పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.
సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
