Vasavi Club Notebook Distribution
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్:
జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండల కేంద్రంలోని గోలి రామలింగం మెమోరియల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు వాసవి వనిత ప్లాటినం క్లబ్ చే గురువారం నోట్ బుక్ లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ స్వచ్ఛంద సంస్థలు అందించే తోడ్పాటు విద్యార్థులు వినియోగించుకోవాలన్నారు. ప్రతి రోజు ప్రార్థన సమావేశానికి హాజరుకావాలని సూచించారు.
ఈ సందర్భంగా తుమ్మనపల్లి అరుణ మాట్లాడుతూ విద్యార్థులందరు క్రమశిక్షణతో మెలగాలని గురువుల పట్ల వినయ విధేయతలు కలిగి ఉండాలని మంచి మార్కులతో పాస్ కావాలని ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా మీకు తగిన విధంగా క్లబ్ సహాయపడుతుందని తెలియజేసినారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ పి.శారద, వాసవి వనిత ప్లాటినం క్లబ్ అధ్యక్షురాలు తుమ్మనపల్లి అరుణ, కార్యదర్శి జయలలిత, కోశాధికారి గోలి సుకన్య, లావణ్య, స్నేహలత, కళావతి, కిరణ్, కళాశాల అధ్యాపకులు కమలాకర్, నవీన్, లావణ్య, మోహన్, రాజీవ్ రాంబాబు, సాంబమూర్తి, థామస్, స్రవంతి, గౌతమి, నీకేత్, రమేష్, సంతోష, సహజ, నరేష్, శ్రీధర్ రాజు, ప్రదీప్, నరేందర్ విద్యార్థులు పాల్గొన్నారు.
