Minister Konda Surekha Say No Drugs Rally
* డ్రగ్స్‌కు సమాజమంతా ‘నో’ చెప్పాలి – మంత్రి కొండా సురేఖ
* టీఎస్జేయూ నిర్వహిస్తున్న ‘సే నో టు డ్రగ్స్’ 2కే ర్యాలీ పోస్టర్ ఆవిష్కరణ
ఆకేరు న్యూస్, హనుమకొండ:
మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రభుత్వం ఒక్కటే కాదు.. సమాజమంతా బాధ్యతగా ముందుకు రావాలని మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు.
యువతను డ్రగ్స్ బారిన పడకుండా కాపాడేందుకు నిరంతర అవగాహన కార్యక్రమాలు అవసరమని ఆమె పేర్కొన్నారు.
తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ (టీఎస్జేయూ) హనుమకొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 23న నిర్వహించనున్న ‘సే నో టు డ్రగ్స్’ 2కే అవగాహన ర్యాలీ పోస్టర్‌ను మంత్రి కొండా సురేఖ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును దెబ్బతీయడమే కాకుండా కుటుంబాలు, సమాజంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు.
డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, మీడియా, విద్యాసంస్థలు, ప్రజలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.
సామాజిక బాధ్యతతో ఈ కార్యక్రమాన్ని చేపట్టిన టీఎస్జేయూను అభినందిస్తూ.. ర్యాలీ విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
* అవగాహనతోనే యువతకు రక్షణ
టీఎస్జేయూ రాష్ట్ర అధ్యక్షుడు నారగౌని పురుషోత్తం మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాలపై నిరంతర అవగాహన ద్వారానే యువతను రక్షించగలమన్నారు.
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ కుమార్ మాట్లాడుతూ.. సమాజంలో చైతన్యం పెంపొందించేందుకు జర్నలిస్టులు తమ వంతు బాధ్యత నిర్వర్తిస్తారని తెలిపారు.
* జూలై 23న భారీగా పాల్గొనాలని పిలుపు
జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి హరికృష్ణ, జిల్లా కోశాధికారి సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ.. జూలై 23న జరిగే 2కే అవగాహన ర్యాలీలో విద్యార్థులు, యువత, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, జర్నలిస్టులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో టీఎస్జేయూ రాష్ట్ర, జిల్లా నాయకులు **వేణు, నగేష్ గౌడ్, నరేష్ గౌడ్, ఈద శ్రీనాథ్, నాగపురి అవినాష్, కౌడగాని మోహన్ రావు** తదితరులు పాల్గొన్నారు.
