INDIA vs ENGLAND T20
* బట్లర్ సెంచరీ.. బ్రూక్ మెరుపులతో 257/3
ఆకేరు న్యూస్, డెస్క్:
భారత్తో జరుగుతున్న ఐదో టీ20లో ఇంగ్లాండ్ బ్యాటర్లు చెలరేగిపోయారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియాపై ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 257 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది.
జోస్ బట్లర్ కేవలం 64 బంతుల్లో 131 పరుగులు (12 ఫోర్లు, 8 సిక్సర్లు) చేసి అజేయంగా నిలిచాడు.
మరోవైపు హ్యారీ బ్రూక్ 45 బంతుల్లో 95 పరుగులు (4 ఫోర్లు, 8 సిక్సర్లు) చేసి భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
దీంతో సిరీస్లో తొలి విజయాన్ని నమోదు చేయాలంటే భారత్ 258 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంది.
