Enumeration Process Raiparthy Inspection
ఆకేరు న్యూస్,రాయపర్తి:
భూమి కొలతల అబ్జర్వర్ మరియు అసిస్టెంట్ డైరెక్టర్ ఎం. శ్రీనివాసులు శనివారం మైలారం, రాయపర్తి గ్రామాలలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో కొనసాగుతున్న ఎనిమరేషన్ (గణన) ప్రక్రియను ఆయన క్షేత్రస్థాయిలో కూలంకషంగా పరిశీలించారు.
గ్రామాల్లోని పలు గృహాలను స్వయంగా సందర్శించారు. లబ్ధిదారులు, స్థానికులతో మాట్లాడి గణన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎన్యూమరేషన్ సిబ్బంది నమోదు చేస్తున్న వివరాల తీరును, రికార్డులను ఆయన నిశితంగా పరిశీలించారు.
* బిఎల్ఓలకు కీలక సూచనలు:
ఈ సందర్భంగా అసిస్టెంట్ డైరెక్టర్ ఎం. శ్రీనివాసులు క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్న బిఎల్ఓలకు (BLO) పలు కీలక సూచనలు చేశారు. ఎన్యూమరేషన్ ప్రక్రియలో ఎలాంటి తప్పులకు తావులేకుండా, అత్యంత ఖచ్చితత్వంతో వివరాలను నమోదు చేయాలని ఆదేశించారు.
గ్రామాల్లోని ప్రతి గృహాన్ని తప్పనిసరిగా సందర్శించాలని, ఏ ఒక్క ఇల్లు నూ వదలిపెట్టకుండా వంద శాతం గణన పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
నిర్దేశిత గడువులోగా నాణ్యతతో కూడిన ప్రక్రియను ముగించాలని సిబ్బందిని ఆదేశించారు.
”ఎన్యూమరేషన్ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, నిబంధనల ప్రకారం సాగాలి. క్షేత్రస్థాయిలో సిబ్బంది అంకితభావంతో పనిచేసి ఈ ప్రక్రియను విజయవంతం చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమములో తహసిల్దార్ ఎం శ్రీనివాస్, ఆర్ ఐ చంద్రమోహన్, ఎన్యూమరేషన్ సిబ్బంది, బిఎల్ఓలు మరియు గ్రామ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
