Student Education Financial Support
ఆకేరు న్యూస్, రాయపర్తి :
నిరుపేద విద్యార్థుల ఉన్నత చదువులకు తమ వంతు సహాయం అందిస్తూ ‘బిల్లా శివాని రెడ్డి చారిటబుల్ ట్రస్ట్’ మరోసారి మానవత్వాన్ని చాటుకుంది. ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో, ఒక ప్రతిభావంతురాలైన నిరుపేద విద్యార్థిని ఉన్నత చదువుల కోసం బిల్లా శివాని రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ. 20,000 (ఇరవై వేల రూపాయలు) ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
మండలంలోని పెరికేడు గ్రామానికి చెందిన కీ “శే అబ్బోజు వెంకన్న పావని కుమార్తె అబ్బోజు ప్రీతిక నిరుపేద కుటుంబం ఉన్నత చదువులకు వెళ్లలేని పరిస్థితిలో ఉన్న విషయాన్ని తెలుసుకున్న బిల్లా శివాని రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బిల్లా సుధీర్ రెడ్డి, ఉషమ్మ, అబ్బోజు ప్రీతిక చదువుల కోసం 20000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులను ఆదుకుని, వారి కలలను నిజం చేయడమే తమ ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ప్రతిభ ఉండి చదువుకోలేని పరిస్థితి ఏ విద్యార్థికీ రాకూడదని, భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను మరిన్ని కొనసాగిస్తామని వారు పేర్కొన్నారు.
ఆర్థిక సహాయం అందుకున్న విద్యార్థిని మరియు వారి కుటుంబ సభ్యులు బిల్లా శివాని రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సాయం తన చదువుకు ఎంతో ఊరటనిచ్చిందని, భవిష్యత్తులో బాగా చదువుకుని సమాజానికి సేవ చేస్తానని విద్యార్థిని ఆనందం వ్యక్తం చేసింది. ఈ కార్యక్రమంలో పెర్కవేడు గ్రామ సర్పంచ్ తీగల సాయిలు గౌడ్, వర్ధన్నపేట ఏఎంసి డైరెక్టర్ పుల్లూరి దామోదర్ గుప్త, సోషల్ మీడియా కోఆర్డినేటర్ బండి రాజేంద్రప్రసాద్, గ్రామ పార్టీ అధ్యక్షుడు బండి కుమార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సుతారి యాదగిరి, ఉపాధ్యక్షులు వల్లపు యాదగిరి, ఎడ్లపల్లి నరేంద్రరావు, వార్డు మెంబర్లు గారే సాయిలు, బండి వెంకన్న, సల్ల కొమురయ్య, పన్నీరు రాజ్ కుమార్, డాక్టరు రవి, బందు రాజు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు
