Bhadrakali Shakambari Navaratri Warangal
ఆకేరు న్యూస్, వరంగల్: వరంగల్లోని చారిత్రాత్మక భద్రకాళి అమ్మవారి ఆలయంలో శాకంబరి నవరాత్రి ఉత్సవాలు బుధవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 29 వరకు జరిగే ఈ వేడుకల్లో భాగంగా నిత్యం ప్రత్యేక కైంకర్యాలు, విశేష పూజలు నిర్వహిస్తారు. పౌర్ణమి ముగింపు రోజున అమ్మవారిని రకరకాల కూరగాయలు, ఆకుకూరలతో అలంకరించి, భక్తులకు ‘సంపూర్ణ శాకంబరి’గా దర్శనమింపజేస్తారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు అన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
