Mulugu Murder Investigation Case
ఆకేరు న్యూస్, ములుగు:
ములుగు జిల్లాలోని
వాజేడు మండలం కడేకల్ దుబ్బగూడెం గ్రామంలో మడే చలపతి (34)అనే వ్యక్తి దారుణ హత్య గురైయ్యారు.శుక్రవారం
అర్ధరాత్రి నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు గొడ్డలితో నరికి చంపారు.ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.తెలిసిన వివరాల ప్రకారం చనిపోయిన వ్యక్తి మడే చలపతి చత్తిస్ ఘడ్ రాష్ట్రానికి చెందిన ఒక వివాహిత (పిల్లలు ఉన్నారు) ను నెలరోజుల కింద చత్తిష్ ఘడ్ రాష్ట్రం నుండి కడేకల్ గ్రామంలోని తన ఇంటికి తీసుక వచ్చారు.మూడు రోజులు ఇంట్లో పెట్టుకున్నాడని మృతుని తండ్రి మదనయ్య తెలిపారు.
ఆ అమ్మాయికి సంబంధించిన బంధువులు ఈ సంఘటన కు పాల్పడి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం పోలీసులు పూర్తి స్థాయిలో వివరాలు సేకరిస్తున్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
