Palakurthi Leaders Felicitation Ceremony
ఆకేరు న్యూస్, పాలకుర్తి:
యాదాది బోర్డు సభ్యులు డాక్టర్ లక్ష్మీనారాయణ, మహిళా కమిషన్ సభ్యులు రాధాబాయి, శ్వేత శంకరమ్మలకు పాలకుర్తి క్యాంప్ ఆఫీస్లో ఘన సన్మానం.
సమాజ సేవలో ముందుంటూ, ప్రజల నమ్మకాన్ని చూరగొన్న వారికే ఉన్నత పదవులు దక్కుతాయని పాలకుర్తి ఎమ్మెల్యే అన్నారు. ఇటీవల యాదాది లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన బోర్డు సభ్యులుగా నియమితులైన డాక్టర్ లక్ష్మీనారాయణ, తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యులుగా ఎన్నికైన నూనావత్ రాధాబాయి, చిట్యాల శ్వేత శంకరమ్మలను పాలకుర్తిలోని క్యాంప్ కార్యాలయానికి ఆహ్వానించి ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందించి వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.
* ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..
నియోజకవర్గానికి చెందిన ముగ్గురు ప్రముఖులకు రాష్ట్రస్థాయిలో కీలక పదవులు దక్కడం పాలకుర్తి నియోజకవర్గానికి ఎంతో గర్వకారణమని హర్షం వ్యక్తం చేశారు. యాదాది క్షేత్ర అభివృద్ధికి, భక్తుల సౌకర్యార్థం డాక్టర్ లక్ష్మీనారాయణ తన అనుభవంతో ఉత్తమ సేవలు అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే, మహిళల హక్కుల పరిరక్షణకు, వారి సంక్షేమానికి నూనావత్ రాధాబాయి, చిట్యాల శ్వేత శంకరమ్మలు కమిషన్ సభ్యులుగా తమ వంతు అద్భుతమైన పాత్ర పోషిస్తారని నమ్మకాన్ని వ్యక్తపరిచారు.
ముఖ్యమంత్రి నమ్మకాన్ని నిలబెడుతూ, తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి, పాలకుర్తి నియోజకవర్గ కీర్తిని మరింత పెంచాలని ఎమ్మెల్యే ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
