station ghanpur students awareness
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
విద్యార్థులు ఇంటర్ స్థాయిలోనే భవిష్యత్ ప్రణాళికను రూపొందించుకోవాలని స్థానిక సిఐ జి.వేణు సూచించారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని గోలి రామలింగయ్య మెమోరియల్ జూనియర్ కళాశాలలో శనివారం
‘షీ టీమ్’ మాదకద్రవ్యాల వినియోగం దాని పర్యవసనంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ విద్యార్థులు సత్ప్రవర్తన కలిగి, చక్కటి భవిష్యతుకు ప్రణాళికను రూపొందించు కోవాలని సూచించారు. కళాశాల ప్రిన్సిపల్ పెద్దపల్లి శారద మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణ రహితంగా ప్రవర్తిస్తే చట్టపరంగా విద్యార్థులు ఎదుర్కొనే పర్యవసనాల గురించి అవగాహన కల్పించారు. సబ్ ఇన్స్పెక్టర్ బి.వినయ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు వేషధారణ, నడవడిక బాగుంటనే సమాజంలో మర్యాద గౌరవం లభిస్తుంది అని సూచించారు. జనగామ జిల్లా “షీ టీం ” సబ్ ఇన్స్పెక్టర్ సిహెచ్.లలిత మాట్లాడుతూ షీ టీం అనేది మహిళల మరియు బాలికల భద్రత కోసం ఏర్పాటుచేసిన ప్రత్యేక టీం అని, ఫోక్సో కేసు గురించి దానివల్ల జరిగే పరిణామాల గురించి, మహిళలు, బాలికలకు సోషల్ మీడియా ద్వారా జరిగే వేధింపులను నిరోధించడం షీ టీం కర్తవ్యం అన్నారు. రాష్ట్ర పోలీస్ అధికారిక హెల్ప్ లైన్ లేదా ఆన్లైన్ పోర్టల్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ పెద్దపల్లి శారద, నరేందర్ రావు, ఎన్.ఎస్.ఎస్. ప్రోగ్రామ్ ఆఫీసర్ కమలాకర్, లావణ్య అధ్యాపక అధ్యాపకేతర బృందం విద్యార్థులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
