Shivunipalli Community Hall Request
Published:
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
కమ్యూనిటీ భవనం నిర్మించాలని జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మున్సిపాలిటీ పరిధి శివునిపల్లి దళిత కాలనీవాసులు స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరికి విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్ తో పాటు 2వ వార్డు కౌన్సిలర్ గుర్రం హరినాథ్, 3 వార్డు కౌన్సిలర్ గుర్రం హైమా, గుర్రం రమేష్ లు ఎమ్మెల్యేను కలిసి విజ్ఞప్తి చేశారు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి త్వరలోనే భవన నిర్మాణానికి నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారు.
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
