Bugulu Venkateswara Swamy Kalyanam
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
జనగామ జిల్లా చిల్పూర్ మండల కేంద్రంలోని శ్రీ బుగులు వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం శ్రీ స్వామివారి కళ్యాణము వేదమంత్రోచరణలతో అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణంలో శ్రీ శ్రీ శ్రీ త్రిదండి రామచంద్ర రామానుజ జీయర్ స్వామి పాల్గొని అమూల్యమైన ప్రవచన సందేశాన్ని భక్తులకు తెలియజేశారు.
కార్యక్రమంలో వివిధ గ్రామాల, పట్టణాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు కిరణ్మయి, ధర్మకర్త మండలి సభ్యులు గణగోని రమేష్, దారం రాజన్ బాబు, గోలీ రాజశేఖర్, రత్నాకర్ రెడ్డి, గొల్లపల్లి వాసు, వేముల వెంకటేశ్వర్లు, భుక్య శీను, నారాయణ రెడ్డి, అరుణ రమేష్ రెడ్డి పాల్గొన్నారు. ఆలయ ఈవో లక్ష్మీ ప్రసన్న ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ సిహెచ్ రాజేందర్ రెడ్డి ముఖ్య అర్చకులు బ్రాహ్మణపల్లి రవీందర్ శర్మ, సౌమిత్రి శ్రీరంగాచార్యులు, కృష్ణమాచార్యులు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. హైదరాబాద్ వాస్తవ్యులు సోమ రాజ సదారామం – మీనా అన్నదాన వితరణ చేశారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
