Pakhal Water Farmers Protest
* వెనుతిరిగిన అధికారులు
ఆకేరు న్యూస్, నర్సంపేట :
వరంగల్ జిల్లా ఖానాపురం మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద పాఖాల సరస్సు ఆయకట్టు రైతులు సోమవారం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. పంటలు ఎండిపోకుండా తక్షణమే సాగునీరు విడుదల చేయాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు డిమాండ్ చేశారు.
రైతుల నిరసనతో వాతావరణం ఉద్రిక్తంగా మారడంతో, అక్కడ అఖిలపక్ష సమావేశం నిర్వహించేందుకు వచ్చిన అధికారులు ఎలాంటి చర్చలు జరపకుండానే వెనుదిరిగారు. తమ సాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించి పంటలను కాపాడాలని ఆయకట్టు రైతులు కోరారు.
