Palimela Police Station Inspection
ఆకేరు న్యూస్, జయశంకర్ భూపాలపల్లి:
జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఐపీఎస్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ రికార్డులు, పెండింగ్ కేసులు, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు.
కేసుల దర్యాప్తు వేగవంతం చేసి, ప్రజల ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు నేరాల నియంత్రణలో అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు.
