station ghanpur congress protest
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్:
న్యాయ పోరాటం చేస్తున్న నిరుద్యోగ యువత, విద్యార్థులకు మద్దతుగా నిలిచిన ఏసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్లమెంటు ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంక గాంధీలతో పాటు పలువురు ప్రతిపక్ష పార్టీ నేతల అరెస్టు చేసి బిజెపి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాంబాబు, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ లావణ్య రెడ్డి, దేవస్థానం చైర్మన్ శ్రీధర్ రావు, మున్సిపాలిటీ చైర్మన్ కుమార్ లు ధ్వజమెత్తారు.
నీట్ పేపర్ లీక్ కు బాధ్యత వహించి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ యువత, విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు మద్దతు ప్రకటించిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే పై పోలీసులు విచక్షణ రహిత్యంగా కొట్టి అరెస్టు చేయడానికి నిరసిస్తూ జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం భారీ ర్యాలీ నిర్వహించి విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న వారిపై ఆర్ఎస్ఎస్ గూండాలు, పోలీసులు దాడి చేయడానికి తీవ్రంగా ఖండించారు. దేశ సంపదను కొల్లగొట్టేందుకు బిజెపి ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని దీని అడ్డుకునేందుకు ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆందోళన అదుపు చేసేందుకు దాడులు చేయించడం, కేసులు పెట్టడంతో దేశంలో బిజెపి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూని చేసిందని వారు దుయ్యబట్టారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగ ఉద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని, నీట్ పేపర్ లీక్ బాధ్యులను గుర్తించి కఠినంగా శిక్షించాలని, కేంద్ర విద్యా శాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో మండల పార్టీల అధ్యక్షులు శిరీష్ రెడ్డి, నాగరాజు, ఐలయ్య పట్టణ అధ్యక్షుడు కిషన్ రాజు, మున్సిపాలిటీ కౌన్సిలర్లు నాయకులు జగదీష్ చంద్ర రెడ్డి, లింగాజి, మనోజ్ రెడ్డి, గట్టు రమేష్, బుర్ల శంకర్, కే సతీష్, బేబీ శ్రీనివాస్, పి నారాయణ, ఐ సుధాకర్, ఫాతి కుమార్, భేతి జైపాల్ రెడ్డి, ఎడవల్లి మల్లారెడ్డి, ఏ నరసింహారెడ్డి, శ్రీరాములు వివిధ గ్రామాల సర్పంచులు నాయకులు పాల్గొన్నారు.
