Mulugu Police Training Camp
పోలీస్ ఉద్యోగ అభ్యర్థులకు వసతితో కూడిన శిక్షణ తరగతులు
– జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకాన్
ఆకేరు న్యూస్, ములుగు:
రాబోయే పోలీస్ శాఖ నోటిఫికేషన్ కోసం ములుగు జిల్లా యువత కు ఉచిత వసతితో కూడిన శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకాన్ తెలిపారు . ఉచిత శిక్షణ శిబిరం కోసం జిల్లాలోని పోలీస్ స్టేషన్ లపరిధిలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు బుధవారం ములుగు జిల్లా కేంద్రంలోని ఏ ఆర్ హెడ్ క్వార్టర్స్ లో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అధికారులు శారీరిక పరీక్షలు నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ శారీరక పరీక్షలలో సఫలీకృతమైన వారికి ఉచిత వసతితో కూడిన శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ములుగు జిల్లా నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ సదానందం,ములుగు సీఐ సురేష్, ఆర్ ఐ లు స్వామి, తిరుపతి, వెంకటనారాయణ, శ్రీకాంత్, ఆర్ఎస్ఐలు సిబ్బంది, నిరుద్యోగ యువత పాల్గొన్నారు.
