Minister Seethakka US Visit return
* అమెరికా పర్యటన ముగించుకుని స్వదేశానికి పయనమైన మంత్రి సీతక్క
* ఘనంగా ఆత్మీయ వీడుకోలు పలికిన టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ అనుమాండ్ల ఝాన్సీ రెడ్డి
ఆకేరు న్యూస్, తొర్రుర్:
అమెరికాలో ఎంతో వైభవంగా నిర్వహించిన తెలంగాణ తెలుగు అసోసియేషన్ (TTA) మెగా కన్వెన్షన్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ మాన్య ధనసరి అనసూయ (సీతక్క) తమ అమెరికా పర్యటనను దిగ్విజయంగా ముగించుకుని తిరిగి స్వదేశానికి బయలుదేరారు.
ఈ సందర్భంగా విమానాశ్రయంలో మంత్రి సీతక్కకు (Minister Seethakka) తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) ఉపాధ్యక్షురాలు మరియు ప్రముఖ సమాజ సేవకురాలు అనుమాండ్ల ఝాన్సీ రెడ్డి, టిటిఎ (TTA) ప్రతినిధులతో కలిసి ఆత్మీయ వీడుకోలు పలికారు.
ఈ సందర్భంగా టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ అనుమాండ్ల ఝాన్సీ రెడ్డి మాట్లాడుతూ..
”అమెరికా గడ్డపై తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెబుతూ నిర్వహించిన TTA మెగా కన్వెన్షన్‌కు మంత్రి సీతక్క,హాజరవ్వడం ఎంతో సంతోషకరం. గిరిజన ప్రాంతాల నుంచి ప్రజాసేవకురాలిగా, నేడు రాష్ట్ర మంత్రిగా ఎదిగిన సీతక్క ఎన్ఆర్ఐలకు తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను, అభివృద్ధి ఫలాలను వివరించిన తీరు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. ప్రజా సమస్యలపై ఎల్లప్పుడూ స్పందించే ఆమె పర్యటన ఎన్ఆర్ఐలలో ఎంతో ఉత్తేజాన్ని నింపింది.”
అమెరికా పర్యటనలో తమకు లభించిన ఆతిథ్యానికి, ప్రవాస భారతీయులు చూపిన ప్రేమాభిమానాలకు మంత్రి సీతక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. స్వదేశానికి తిరుగు ప్రయాణమైన మంత్రి కి TTA నాయకులు, కాంగ్రెస్ శ్రేణులు మరియు ఎన్ఆర్ఐలు ఘనంగా వీడ్కోలు పలికారు.
ఈ కార్యక్రమంలో TTA ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐ విభాగ నాయకులు మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు
Please tell us what is wrong. Your report will be sent to the website team.
