EGS Staff Pen Down Protest
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్:
జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ ఈజీఎస్ సిబ్బంది శుక్రవారం పెన్‌డౌన్ కు దిగింది. ఎంసిసి సిబ్బంది రాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటీ నిర్ణయం మేరకు పెన్ డౌన్, షట్ డౌన్ కు పిలుపు మేరకు విధులను బహిష్కరించారు. ఈ సందర్భంగా ఈజిఎస్ సిబ్బంది మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుండి ఈజీఎస్ పథకంలో సేవలు అందిస్తూ, ప్రతి కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తూ ఎన్నో ప్రతిష్టాత్మక పథకాలను అమలుపరిచి, ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా, ప్రభుత్వం పే స్కేల్ అమలు లేకుండా, ఉద్యోగ భద్రత సమస్యలు పరిష్కరించడంలో పాలకులు విఫలమయ్యారని ఆరోపించారు.
పని ఒత్తిడితో, మానసిక, శారీరక ఇబ్బందులు పడుతూ సేవలకు ఎలాంటి ఉద్యోగ భద్రత, గుర్తింపు లేకపోగా, కనీసం గౌరవం కూడా దక్కడం లేదన్నారు. గత మూడు నెలలుగా జీతం రాక చాలా ఇబ్బందులు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నోసార్లు వినతి పత్రాలు ప్రజాప్రతినిధులను కలిసి ఇచ్చినప్పటికీ కూడా సమస్యలు పరిష్కారం కానందుకుగాను ఈరోజు నుండి రాష్ట్ర జేఏసీ నిర్ణయం మేరకు, jac రాష్ట్ర కార్యచరణ ప్రకారంగా పెన్ డౌన్, షట్ డౌన్ చేస్తున్నట్లు తెలిపారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
