Station Ghanpur Drug Awareness Program
* జాగృతి పోలీస్ కళాబృందంతో అవగాహన కార్యక్రమం
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్:
యువకులు గంజాయి డ్రగ్స్, గుట్క మత్తు పదార్థాల బారిన పడవద్దని ఎస్సైలు బి.వినయ్ కుమార్, పి.రాజేష్ పిలుపునిచ్చారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం కొత్తపల్లిలో శుక్రవారం రాత్రి
జాగృతి పోలీస్ కళా బృందం ఆధ్వర్యంలో ప్రజలను చైతన్య పరిచారు. వరంగల్ పోలీస్ కమీషనర్ శ్వేత ఆదేశాల మేరకు నిర్వహించిన కార్యక్రమంలో పాటలు, కళారూపాలు, మెజీషియన్ తో ప్రజలకు సమాజం పట్ల, చెడు వ్యసనాల పట్ల అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఎస్సైలు మాట్లాడుతూ యువకులు గంజాయి, డ్రగ్స్, గుట్క మత్తు పదార్థాల బారిన పడవద్దని దాని ప్రభావంతో యువత బంగారు భవిష్యత్తును కోల్పోతుందని తల్లిదండ్రులు తమ పిల్లల్ని జాగ్రత్తపరుచుకోవాలని కోరారు. గంజాయి అమ్మిన సేవించిన 8712584473 మొబైల్ నెంబరుకు సమాచారం ఇవ్వాలని కోరారు. కళా బృందo సభ్యులు చదువు, రోడ్డు ప్రమాదాలు, బాల్య వివాహాలు, బాల కార్మికులు, డయల్ 100, సీసీటీవీ కెమెరాలు, ముసలి తల్లితండ్రులను మంచిగ చూసుకోవాలని వివిధ అంశాలపై పాడిన పాటలు ఆలోచింప చేశాయి. మూఢ నమ్మకాలపై మ్యాజిక్ షో, మరియు సైబర్ క్రైమ్స్, ఆన్ లైన్ బెట్టింగ్ గేమ్స్ పై నాటిక ద్వార ప్రదర్శన చేస్తు 1930 నేషనల్ సైబర్ హెల్ప్ లైన్ నంబర్ గురించి చెప్పినారు.
ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ ముక్కెర స్వరూప రవి, ఉప సర్పంచ్ గోవిందు ఇసాక్, కళాబృందం ఇంచార్జీ వుమెన్ ఏ ఎస్ఐ నాగమణి, కళాబృందం సభ్యులు, విలియమ్, వెంకటేశ్వర్లు, రత్నయ్య హోంగార్డ్స్ శ్రీనివాస్, నారాయణ, విక్రమ్ రాజు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
