Station Ghanpur
Station Ghanpur: ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్పూర్: ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ డివిజన్ కేంద్రంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్ జెండా ఆవిష్కరించి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ నీల రాజమ్మ గట్టయ్య, కమిషనర్ రాధాకృష్ణ, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. అలాగే ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాలతో పాటు ఏసీపీ కార్యాలయం, వ్యవసాయ మార్కెట్, పాఠశాలలు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లోనూ అధికారులు జాతీయ జెండాను ఆవిష్కరించారు.
జనసేన ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం
స్టేషన్ ఘన్పూర్లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించారు. స్థానిక శివాజీ చౌక్ వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు గాదె పృథ్వీ హాజరయ్యారు. పార్టీ జిల్లా నాయకులు అమంచ సునీల్, మొహమ్మద్ రజాక్, మెడిద ప్రశాంత్ రెడ్డి, కొలిపాక వంశీకృష్ణ, అక్కెనపల్లి సాయి, గ్యార బన్నీ తదితరులు పాల్గొన్నారు.
97 జీవో రద్దు చేయాలని విద్యార్థుల ధర్నా
97 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు చేపట్టిన ధర్నాకు జనసేన పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. గాదె పృథ్వీ ఆధ్వర్యంలో విద్యార్థుల ఆందోళనకు సంఘీభావం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు అమంచ సునీల్, మొహమ్మద్ రజాక్, కొలిపాక వంశీకృష్ణ, అక్కెనపల్లి సాయి, విద్యార్థి విభాగం నాయకులు మెడిద ప్రశాంత్ రెడ్డి, గ్యార బన్నీ, సూర అరవింద్, వజ్జిర యశ్వంత్, సాత్విక్, విక్రమ్ కుమార్, నితిన్ తదితరులతో పాటు పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
