CPM Farmers Power Demand
* సాగునీరు, నాణ్యమైన కరెంటు ఇవ్వాలి
– సిపిఎం డిమాండ్
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
రైతులకు సాగునీరు, 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలని సీపీఎం చిల్పూర్ మండల శాఖ డిమాండ్ చేసింది. జనగామ జిల్లా చిల్పూర్ మండలంలో పోరు బాట కార్యక్రమం చేపట్టింది.
ఈ సందర్భంగా మండలంలోని ఫతేపూర్, లింగంపల్లి, శ్రీపతిపల్లి గ్రామాల్లో రైతులను కలిసి విద్యుత్ సమస్యలపై సర్వే నిర్వహించారు.
రోడ్ల ప్రక్కన, వ్యవసాయ పొలాల్లో ప్రమాదకరంగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, వ్యవసాయ బావుల దగ్గర విద్యుత్ వైర్లు వేలాడుతూ ప్రమాదకరంగా ఉండడాన్ని గుర్తించారు. మరికొన్ని వ్యవసాయ బావుల వద్దకు విద్యుత్ స్తంభాలకు బదులు కర్రలపై విద్యుత్ వైర్లు వెళ్లిన దృశ్యాలు కనిపించినట్లు గుర్తు చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పెండింగ్ లో ఉన్న విద్యుత్ సర్వీసులకు మోక్షం కల్పించాలని, ప్రమాదకరంగా మారిన ట్రాన్స్ఫార్మర్లకు రక్షణ కల్పించాలని, లూస్ లైన్లను సరిచేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి సాదం రమేష్ ఊరడి లింగయ్య, అపరాధపు రాజు, ఆవుల ప్రభాకర్, కర్రె నాగరాజు, పురమాని శ్రావణ్, బర్మ రవితో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
