* రాజ్యసభలో అధికార, విపక్షాల మాటల యుద్ధం
* విపక్ష ఎంపీల వాకౌట్
ఆకేరు న్యూస్ డెస్క్ : అధికార, విపక్ష సభ్యుల మాటల యుద్ధంతో ఈరోజు రాజ్యసభ (Rajya Sabha) రణరంగంగా మారింది. ఓవైపు విపక్షాల నిరసనలు కొనసాగుతుండగానే, రాష్ట్రపతి (President) ప్రసంగానికి ధన్యావాద తీర్మానంపై ప్రధాని (Prime Minister) ప్రసంగం కొనసాగించారు. తమకన్నా ముందు రిమోట్ కంట్రోల్ ప్రభుత్వం కొనసాగిందని, తాను అభివృద్ధిపరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నామని ప్రధాని మోదీ (Prime Minister Modi) తెలిపారు. విపక్షాలు పెద్దల సభను అవమానిస్తున్నాయని ఫైర్ అయ్యారు. తమ విజయాన్ని కాంగ్రెస్ (Congress) ఓర్వలేకపోతోందని ధ్వజమెత్తారు. నిజాలు చెబితే విపక్షాలు (Oppositions) భరించలేకపోతున్నాయన్నారు. ఈ ఎన్నికల్లో దేశ ప్రజలు తమపై చూపిన విశ్వాసంపై గర్వంగా ఉందన్నారు. అయితే ప్రతిపక్షాలు మోదీ ప్రసంగాన్ని నిరసిస్తూ వాకౌట్ చేశాయి.
మరో 20 ఏళ్లు మేమే..
తామ ప్రభుత్వం మరో 20 ఏళ్లు అధికారంలో ఉంటుందని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల రిజల్ట్స్ (Election Results) వచ్చినప్పటి నుంచి ఓ కాంగ్రెస్ నేత తమను మూడో వంతు ప్రభుత్వం అంటూ విమర్శిస్తున్నాడన్నారు. అయితే.. అది నిజమేనని తనదైన శైలిలో మోదీ స్పందించారు. తాము పదేళ్ల పాలన పూర్తి చేసుకున్నామన్నారు. మరో 20 ఏళ్లు అధికారంలో ఉంటామని ధీమా వ్యక్తం చేశారు. ఈ లెక్కన మూడో వంతు ముగిసిందన్నారు. ఇంకా రెండు వంతులు మిగిలి ఉందని కాంగ్రెస్ పై వ్యంగ్యాస్త్రాలు విసిరారు ప్రధాని.
నిండు సభలో ప్రధాని అసత్యాలు
పెద్దల నిండు సభలో ప్రధాని నరేంద్ర మోదీ అసత్యాలు పలుకుతున్నారని, అందుకే సభను నుంచి వాకౌట్ (Walkout) చేశామని రాజ్యసభ (Rajya Sabha) లో విపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ మల్లికార్జున్ ఖర్గే (Congress MP Mallikarjun Kharge) వెల్లడించారు. ప్రధాని ప్రసంగంలో కొన్ని తప్పుడు అంశాలను సభకు వెల్లడించినందుకు నిరసన (Protest) గా తాము వాకౌట్ చేశామని తెలిపారు. అసత్యాలు పలకడం ఆయనకు అలవాటని సత్యదూరమైన అంశాలను ప్రస్తావిస్తుంటారని ఖర్గే ఆరోపించారు. ప్రధాని రాజ్యాంగం గురించి మాట్లాడుతుంటే మీరు రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తారని తాను పేర్కొన్నానని చెప్పారు. రాజ్యాంగం కోసం పాటుపడేది ఎవరు, దాన్ని వ్యతిరేకించేది ఎవరనేది స్పష్టం చేశానని తెలిపారు. ఆరెస్సెస్ రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తుందని, వారు బీఆర్ అంబేడ్కర్, పండిట్ జవహర్లాల్ నెహ్రూ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారని ఖర్గే అన్నారు.
——————–