* కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆపరేషన్ ముష్కన్
* జులై -1 నుండి 31 వరకు ఆపరేషన్ మాస్కాన్.
* ఆపరేషన్ మాస్కాన్ పోస్టర్లను ఆవిష్కరించిన వరంగల్ పోలీస్ కమిషనర్.
* బాల కార్మికుల వెట్టిచాకిరీ నుండి విముక్తియే లక్ష్యం.
ఆకేరు న్యూస్, హనుమకొండ: బాలల సంరక్షణ (Childcare) సామాజిక బాధ్యతగా గుర్తించాలని పోలీస్ కమిషనర్ (Police Commissioner) అన్నారు. బాల కార్మికుల వెట్టిచాకిరి నుండి విముక్తి యే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆపరేషన్ ముస్కాన్ (Operation Muskan) కార్యక్రమంలో భాగంగా జులై 1వ తేది నుండి జులై 31వ తేది వరకు నిర్వహిస్తున్న ఆపరేషన్ ముస్కాన్ 10వ విడత పోస్టర్లను వరంగల్ పోలీస్ కమిషనర్ (Warangal Police Commissioner) బుధవారం ఆవిష్కరించారు.
పోలీస్ , వివిధ ప్రభుత్వ శాఖలు, ఎన్జీవో సంస్థలకు చెందిన ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్న ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ కమిషనరేట్ పరిధిలో బాల కార్మికులతో పాటు, వేధింపులకు గురైన బాలలను గుర్తించాలన్నారు . ఆశ్రమాలలో ఆచూకీ తెలియకుండా ఉన్న బాలలను గుర్తించి వివిధ ప్రభుత్వ శాఖల సహకారంతో పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం కృషి చేయాలన్నారు. పిల్లల పట్ల ఎవరైనా కఠినంగా వ్యవహరించినట్లయితే వారి పైన తగిన చర్యలు చేపట్టాలని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా(Police Commissioner Amber Kishore Ja) అన్నారు..
ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ రవి(DCP Ravi) హనుమకొండ, వరంగల్, జనగాం జిల్లాలకు చెందిన బాలల సంరక్షణ సమితి చైర్ పర్సన్స్ దామోదర్ (Child Welfare Committee Chairperson Damodar), వసుధ, ఉప్పలయ్య, బాలల పరిరక్షణ అధికారులు ప్రవీణ్ (Child Protection Officers Praveen), రాజు, రవికాంత్ చైల్డ్ లైన్ కోఆర్డినేటర్స్ భాస్కర్, శ్వేత, ఎఫ్ ఎన్ ఎం సాంఘిక సేవా సంస్థ ప్రాజెక్టు కోఆర్డినేటర్లు ఎర్ర శ్రీకాంత్, బత్తుల కరుణ, డైరెక్టర్ సిస్టర్ సహాయ , షేర్ ఎన్జీవో ప్రతినిధులు శిరీష, వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఏహెచ్ టీయు సిబ్బంది పసియోద్దీన్ ,మల్లేష్, భాగ్యలక్ష్మి శ్రీనివాస్, రామారావు తో పాటు మూడు జిల్లాలకు చెందిన పోలీస్ మరియు లేబర్ శాఖ అధికారులు పాల్గొన్నారు.
——————————-