
చిన్నారి రియాన్షిక
* భద్రాద్రి కొత్తగూడెంలో తీవ్ర విషాదం
ఆకేరు న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం : ఓ పెన్ను చిన్నారి ప్రాణం తీసింది (A pen took the child’s life). అప్పటి వరకూ మంచంపై గెంతుతూ.. కేరింతలు కొడుతూ ఆడుతున్న ఆ చిన్నారి అంతలోనే అనంతలోకాలకు చేరిపోయింది. తల్లిదండ్రులకు తీవ్ర శోకాన్ని మిగిల్చింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Kothagudem District) భద్రాచలం పట్టణం(Bhadrachalam town) లో ఈ విషాదం చోటుచేసుకుంది. సుభాష్ నగర్ కాలనీకి (Subhash Nagar Colony) చెందిన చిన్నారి రియాన్షిక (4) మంచంపై ఆడుకుంటూ కిందపడిపోయింది. అదే ప్రాంతంలో ఉన్న పెన్ను రియాన్షిక చెవి పైభాగం లోపలికి చొచ్చుకుపోయింది. తల్లిదండ్రులు హుటాహుటిన ఖమ్మంలోని ఓప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. సర్జరీ అనంతరం బ్రెయిన్ కు ఇన్ ఫెక్షన్ కావడంతో చిన్నారి రియాన్షిక ప్రాణాలొదిలింది. రియాన్షిక మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. పాపకోసం 2.50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా చిన్నారి ప్రాణాలు దక్కకపోవడంతో బోరున విలపిస్తున్నారు.
——————————