* సర్కిళ్లలో పర్యటిస్తున్న జీహెచ్ ఎంసీ కమిషనర్
* వీధులు పరిశుభ్రంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : జీహెచ్ఎంసీ కమిషనర్ గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతల్లో కొనసాగుతున్న ఆమ్రపాలి (Amrapali) ఆకస్మిక తనిఖీలతో యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. సర్కిళ్లలో పర్యటిస్తూ సమస్యల పరిష్కరానికి చొరవ చూపుతున్నారు. బుధవారం నగరంలోని పలు ప్రాంతాల్లో ఆకస్మికంగా తనిఖీలు చేశారు. అదనపు కమిషనర్ రవికిరణ్‌తో కలిసి నారాయణగూడ క్రాస్‌రోడ్, శంకర్‌మఠ్ వద్ద రాంకీ ఆర్ఎఫ్సీ వెహికల్ డ్రైవర్‌తో కమిషనర్ మాట్లాడి చెత్త తరలింపు వివరాలను అడిగి తెలుసుకున్నారు. నారాయణగూడ ఫ్లై ఓవర్ సమీపంలో కొత్తగా నిర్మించిన మోడల్ మార్కెట్ పనుల విషయాన్ని అక్కడే ఉన్న చిరు వ్యాపారులను అడిగి తెలుసుకున్నారు. గురువారం కూడా తనిఖీలు కొనసాగించారు. ఉదయం నుంచీ కూకట్పల్లి, మూసాపేట, భరత్‌నగర్ ప్రాంతాల్లో పర్యటించారు. రైతుబజార్ ను పరిశీలించారు. వీధులన్నీ శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
———————————-