Nani's The Paradise Teaser
* నాని ‘ది ప్యారడైజ్’ టీజర్‌తో గూస్బంప్స్!
* సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్
ఆకేరు న్యూస్, డెస్క్: నేచురల్ స్టార్ నాని హీరోగా, ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’ నుంచి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన టీజర్ విడుదలైంది.
ఇప్పటికే పోస్టర్లు, ‘రా స్టేట్మెంట్’ గ్లింప్స్, ‘ఆయా షేర్’ పాటతో భారీ అంచనాలు నెలకొల్పిన ఈ సినిమా.. తాజాగా విడుదలైన టీజర్‌తో ఆ అంచనాలను మరింత పెంచింది. కొత్త రిలీజ్ డేట్‌ను కూడా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
* జడల్ జమానా..దిష్టంతా పోవాలే..
సుమారు 1 నిమిషం 35 సెకన్ల నిడివితో విడుదలైన టీజర్లో నాని ‘జడల్’ అనే శక్తివంతమైన పాత్రలో కనిపించాడు. “ఇక నుంచి ఈ జాగా మనదే” అంటూ ప్రారంభమయ్యే టీజర్లో యాక్షన్, ఎమోషన్, తిరుగుబాటు భావజాలాన్ని దర్శకుడు అద్భుతంగా ఆవిష్కరించాడు.
“చీ అని చీదరించుకునే నలుపు రంగే మన జెండా.. కాకే దాని మీద గుర్తు” వంటి డైలాగులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నాని స్క్రీన్ ప్రెజెన్స్, మాస్ లుక్, యాక్షన్ సన్నివేశాలు అభిమానులకు గూస్బంప్స్ తెప్పిస్తున్నాయి.
* మోహన్ బాబు స్టైలిష్ ఎంట్రీ.. అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ హైలైట్
టీజర్లో మోహన్ బాబు స్టైలిష్ లుక్‌తో కనిపించగా, ఆయన చెప్పిన డైలాగులు కథపై ఆసక్తిని పెంచుతున్నాయి. అనిరుధ్ రవిచందర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజర్‌కు మరింత బలం చేకూర్చింది. జి.కె. విష్ణు సినిమాటోగ్రఫీ, యాక్షన్ విజువల్స్, మేకింగ్ క్వాలిటీ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో నిలబెట్టేలా కనిపిస్తున్నాయి.
* భారీ తారాగణం.. పాన్ వరల్డ్ రిలీజ్
ఈ చిత్రంలో నాని సరసన కయాడు లోహర్ హీరోయిన్గా నటిస్తుండగా, మోహన్ బాబు, రాఘవ్ జుయల్, సోనాలి కులకర్ణి, తనికెళ్ల భరణి, సంపూర్ణేష్ బాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
* ఎప్పుడు విడుదల?
‘ది ప్యారడైజ్’ చిత్రాన్ని సెప్టెంబర్ 24, 2026 న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాలీతో పాటు ఇంగ్లీష్, స్పానిష్ వంటి పలు అంతర్జాతీయ భాషల్లో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
దీంతో ఈ సినిమాపై దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
