PRTU Station Ghanpur President
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ పి ఆర్ టి యు (టీఎస్) మండలం అధ్యక్షులుగా గీరెడ్డి ప్రమోద్ రెడ్డి ఎన్నికయ్యారు. గురువారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన మండల సర్వ సభ్య సమావేశంలో మండల అధ్యక్షలుగా మరోకసారి జెడ్ పి ఎస్ ఎస్ తాటికొండ ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న గీరెడ్డి ప్రమోద్ రెడ్డ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సర్వసభ్య సమావేశంనికి ముఖ్య అతిధిగా జనగామ జిల్లా ప్రధాన కార్యదర్శి నూకలు ఎల్లారెడ్డి, ఎన్నికల పరిశీలకులుగా గిరెడ్డి సురేష్ కుమార్, గొట్టెముక్కుల శ్రీధర్ రెడ్డి హాజరయ్యారు. 2026 – 2028 సంవత్యరాలకు గానూ ఎన్నుకొన్న నూతన మండల కార్యవర్గంలో ప్రధాన కార్యదర్శిగా వంగ రఘు గౌడ్, మండల బాధ్యులుగా మధుబాబు, విజేందర్, మంజుల, వెంకటయ్య
బాధ్యతలు స్వీకరించారు. కార్య క్రమంలో రాష్ట్ర బాధ్యులు
ప్రకాశం, పిట్టల వెంకటేశ్వర్లు, ప్రవీణ్, భాస్కరరెడ్డి, మురళి, పింగిలి వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
