Narendra Modi on National Handloom day
* ఈ సారి మస్త్ డిఫరెంట్
* చేనేత వస్త్రాలను కొనుగోలు చేద్దాం..
* నేతన్నల నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటుదాం
– ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు
ఆకేరు న్యూస్ , ప్రత్యేక ప్రతినిధి : ప్రధాన మంత్రి నరేంద్ర మోది మరో వీడియో రిలీజ్ చేశారు. ఈ సారి సెల్పీ వీడియో కాకుండా అటూ.. ఇటూ తిరుగుతూ మాట్లాడుతున్న వీడియో తన యూట్యూబ్ చానల్లో పోస్ట్ చేశారు.. చేనేత దినోత్సవం గురించి మాట్లాడారు..
ఆ వీడియోలో...
జాతీయ చేనేత దినోత్సవం ఆగస్టు 7 వతేదీని పురస్కరించుకుని భారత ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ప్రత్యేక సందేశాన్ని అందించారు. 1905 ఆగస్టు 7న దేశ స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా చారిత్రాత్మక ‘స్వదేశీ ఉద్యమం’ ప్రారంభమైందని, అదే ‘ఆత్మనిర్భర్ భారత్ కు బలమైన పునాది వేసిందని ప్రధాని గుర్తుచేశారు ..ఆ రోజుల్లో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాగిన ఈ ఉద్యమంలో దేశంలోని ప్రతీ పౌరుడు భాగస్వామి అయ్యారని పేర్కొన్నారు.
* ఉత్సాహంతో చేనేత దినోత్సవం జరుపుకుందాం
ఇటీవలే దేశవ్యాప్తంగా ప్రజలందరూ ‘ఫ్రెండ్షిప్ డే’ను ఎంతో ఉత్సాహంగా జరుపుకున్న తరహాలోనే, ఆగస్టు 7న వచ్చే చేనేత దినోత్సవం ( National Handloom Day ) ను కూడా అంతే ఉత్సాహంతో, వేడుకలా జరుపుకోవాలని ప్రధాని కోరారు చిన్నపాటి ఇళ్లలోనే చేతి మగ్గాలపై ఎంతో శ్రమించి వైవిధ్యమైన, నాణ్యమైన వస్త్రాలను తయారుచేసే పేద చేనేత కుటుంబాలను ప్రోత్సహించడమే ఈ రోజు ముఖ్య ఉద్దేశమని తెలిపారు.
*చేనేత వస్త్రాలపై వీడియోలతో ప్రచారం చేయాలి
చేనేత రంగానికి ప్రాచుర్యం కల్పించేందుకు సాంకేతికతను, సోషల్ మీడియాను సద్వినియోగం చేసుకోవాలని మోదీ సూచించారు. చేనేత దుస్తులను ధరించి ‘GRWM’ (Get Ready With Me) తరహా ప్రత్యేక వీడియోలు చేసి ప్రపంచం ముందుకు తీసుకురావాలని పిలుపునిచ్చారు.ప్రతి ఒక్కరూ స్వయంగా కొన్ని చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేయాలని, వాటిపై వీడియోలు తీసి దేశవిదేశాల్లో ప్రచారం చేయాలని కోరారు. దీనివల్ల మన నేత సోదరసోదరీమణుల సామర్థ్యం, నైపుణ్యం ప్రపంచానికి తెలియడమే కాకుండా, వారి కుటుంబాలకు ఆర్థికంగా చేయూత లభించి ‘ఆత్మనిర్భర్ భారత్’ కల నెరవేరుతుందని స్పష్టం చేశారు .ఈ సందర్భంగా దేశప్రజలందరికీ జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
