MLA Naini Rajender Reddy Unveils Poster for 10 Crore De-Addiction Pledge Campaign
* పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే నాయిని
ఆకేరు న్యూస్, హనుమకొండ: మాదకద్రవ్యాలు, మద్యం మరియు పొగాకు వంటి దురలవాట్లు లేని ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి పిలుపునిచ్చారు.
బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహించ తలపెట్టిన “10 కోట్ల వ్యసన విముక్తి ప్రతిజ్ఞల మహా ఉద్యమం” ప్రాజెక్టు పోస్టర్ను శుక్రవారం ఉదయం బాలసముద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో బ్రహ్మకుమారీస్ ప్రతినిధులతో కలిసి ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన “నశా ముక్త్ భారత్ అభియాన్ (వ్యసన ముక్త భారత ప్రచార యాత్ర)” లో భాగంగా సమాజాన్ని వ్యసన రహితంగా మార్చడానికి కట్టుబడి ఉంటామని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ప్రతిజ్ఞ చేశారు.
* యువత ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలి..
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రస్తుత రోజుల్లో మద్యం, మాదకద్రవ్యాలు, పొగాకు ఉత్పత్తుల వల్ల అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యసనాలు కేవలం వ్యక్తిగత ఆరోగ్యానికే కాక, కుటుంబ వ్యవస్థను, సమాజ పురోగతిని దారుణంగా దెబ్బతీస్తాయని హెచ్చరించారు.
ముఖ్యంగా దేశ భవిష్యత్తు అయిన యువత దురలవాట్లకు దూరంగా ఉంటూ, శారీరక, మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యతనిచ్చే జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు. సమాజంలో సానుకూల మార్పు తీసుకురావడానికి బ్రహ్మకుమారీస్ సంస్థ నిర్వహిస్తున్న ఇలాంటి అవగాహన కార్యక్రమాలు ఎంతో అభినందనీయమని కొనియాడారు.
* కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు..
ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో బ్రహ్మకుమారీస్ ప్రతినిధులు BK విమల, శోభ, కల్పన, అనిల్, రాఘవ చారి, శ్యామ్, అరుణ్ లతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
