Allu Arjun RAAKA Movie
ఆకేరు న్యూస్, హైదరాబాద్:
దర్శకుడు అట్లీ, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో వస్తున్న పాన్ ఇండియా చిత్రం “రాకా”.ఈ మూవీపై అభిమానుల్లో ఎంతో క్రేజ్ ఉంది. పుష్ప 2 పాన్ ఇండియా స్థాయిలో హిట్ కావడం తెలిసిందే. అందుకు ఏ మాత్రమూ తీసికట్టు కాదు రాకా. భారీ బడ్జెట్, అతున్నత టెక్నాలజీతో మేకర్స్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
* దీపిక పోర్షన్ పూర్తయినట్లే..
బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే ప్రధాన పాత్రల్లో నటిస్తున్నది. ఈ సినిమాకు సంబంధించిన కీలక షెడ్యూల్ ప్రస్తుతం ముంబైలో చిత్రీకరిస్తున్నారు. బన్నీ, దీపికాల మీద సీన్స్ తీస్తున్నారు. అయితే ఈ షూటింగ్ తో ఆమె పోర్షన్ పూర్తయినట్లు తెలుస్తోంది. కానీ వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి షూటింగ్ పూర్తి చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.
* భారీ తారాగణం..
బాలీవుడ్ బ్యూటీ దీపికాతో పాటు మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్, రష్మిక మందన్న కూడా ప్రధాన పాత్రల్లో కనిపిస్తారని వినికిడి. అయితే ఈ వార్తలపై చిత్ర బృందం ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.ఇటీవల రష్మిక ఒక సినిమా షూటింగ్ లో తీవ్రంగా గాయపడింది. కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. అలగే జాన్వీకపూర్ ఇటీవల పెద్ది సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించారు.
* మూడునెలలకు పైగా షూట్..
రాకా షూట్ చాలా పెండింగ్ ఉందని తెలుస్తోంది. దాదాపు 100 రోజులకు పైగా షూట్ జరగాలని సమాచారం. భారీ బడ్జెట్, హై టెక్నాలజీ వినియోగం కావడంతో చిత్రీకరణ వేగంగా కాకుండా నాణ్యతకు పెద్దపీట వేశారట మేకర్స్. ఒక్క సారి షూట్ అంతా పూర్తయితే రిలీజ్ డేట్ లాక్ చేసే అవకాశం ఉందని చిత్రవర్గాలు తెలుపుతున్నాయి.
* తాత, తండ్రి, కొడుకులుగా .. బన్నీ..
పునర్జన్మల నేపథ్యంతో సాగే హై-స్కేల్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామా. తన గతానికి ముడిపడి ఉన్న శక్తులను ఎదుర్కొనే ఒక శక్తివంతమైన పాత్ర చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అల్లు అర్జున్ తాత, తండ్రి, కొడుకులుగా సుమారు నాలుగు వేర్వేరు పవర్ఫుల్ పాత్రల్లో కనిపిస్తారని టాక్.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
