Nani Bloody Romeo Heroine
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : న్యాచురల్ స్టార్ నాని , సుజీత్ డైరెక్టర్ల ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ‘బ్లడీ రోమియో’. అక్టోబర్ నుంచి షూట్ స్టార్ట్ కానుంది. హీరోయిన్ కోసం చిత్రబృందం సెర్చ్ చేస్తోంది. ఒక వేళ దొరికితే అక్టోబర్ నుంచి షూట్ మొదలవుతుంది.
* బోర్సే.. దిల్ సే
నాని సరసన నటి భాగ్యశ్రీ బోర్సే ను తీసుకోనున్నట్లు టాలీవుడ్ లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అక్కినేని అఖిల్ హీరోగా, ఆమె హీరోయిన్ గా వచ్చిన లేటెస్ట్ మూవీ లెనిన్. బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకేముంది దీపం ఉండగానే ఇల్లు చక్క బెట్టుకోవాలన్నట్లు ఈ బ్యూటీ తన రెమ్యునరేషన్ పెంచిందని టాక్.
* క్లారిటీ రాలేదు
భాగ్యశ్రీ బోర్సే తో చిత్రబృందం సంప్రదిస్తున్నట్లు సమాచారం తెలుస్తున్నా దీనిపై రాబోవు రోజుల్లో ఒక క్లారిటీ రానుంది. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు మేకర్స్. టాలీవుడ్లో చేతి నిండా చాన్సులు వస్తున్నాయి. కానీ ఆమె తన నటన, అభినయానికి స్కోప్ ఉన్న పాత్రలనే ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ‘బ్లడీ రోమియో’ కే పడిపోయినట్లు తెలుస్తోంది. చిత్రం బృందం దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు రాబోయే రోజుల్లో చేస్తుందేమో చూడాలి.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
