Avika Gor Dengue News
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : బుల్లితెరపై ఆనందిగా మనకు సుపరిచితురాలైన నటి అవికా గోర్.. ప్రస్తుతం ఆమె డెడికేషన్ చూసి వావ్ అనక తప్పదు.. వృత్తిపట్ల తనకున్న అంకింత భావానికి అందరూ ఫిదా కావాల్సిందే..
* 104 జ్వరం.. అంకితభావానికి దక్కిన ప్రశంస
అవికా గోర్ ఐదు రోజులుగా జ్వరంతో బాధపడుతూ ముంబయిలోని ఒక ప్రైవేటు ఆస్ప్రతితో చేరారు. జ్వరం అని చేరితే చివరికి డెంగ్యూగా నిర్ధారణైంది. అంతకుముందు సాధారణ ఫీవర్ గా భావించి నిర్మాతకు నష్టం కలగకుండా ఉండాలని భావించి జ్వరంతోనే షూటింగ్ లో పాల్గొని అందరితో శభాష్ అనిపించుకుంది. 104 డిగ్రీల జ్వరంతో బాధపడుతున్నప్పటికీ పని ఆపలేదని , షూటింగ్ వాయిదా పడితే నిర్మాతలకు నష్టం కలుగుతుందనే ఉద్దేశంతోనే అవికా ఈ నిర్ణయం తీసుకున్నారని నటి భర్త మిలింద్ చెప్పారు. సమయం, డబ్బు వృథా కాకూడదనే భావించి తాను ఇలా చేసిందని చెప్పారు. అవికాకు పని పట్ల ఉన్న అంకితభావాన్ని ఓ భర్తగా తాను అభినందిస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్యం సహకరించకున్నా తన భార్య పట్టుదలతో పని చేసిందని కొనియాడారు.
* ముంబయి టు ఢిల్లీ ప్రయాణం
ముంబయి షూట్ తర్వాత ఒక యాడ్ షూట్ కోసం ఢిల్లీకి చేరారు. ఆ తర్వాత నీరసం, జ్వరం మరింత ఎక్కువయ్యాయి. చేసేది లేక డెంగ్యూ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా అని వచ్చింది. ప్రస్తుతం ఆమెను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
* ఆమె పరిస్థితికి సింక్..‘బుఖార్’
అవికా నటించిన లేటెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్ పేరు ‘బుఖార్’ (అంటే జ్వరం). ఈ ఆల్బమ్ విడుదలైన రోజే ఆమె నిజంగానే జ్వరంతో ఆసుపత్రి పాలయ్యారు. దీని బట్టి బుఖార్.. సరిగా ఆమె ఇప్పుడున్న పరిస్థితికి సింక్ అయ్యింది. ఆసుపత్రి బెడ్ నుంచే పాట రిలీజ్ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. తన ప్లేట్లెట్ కౌంట్ గురించి ఆందోళనతో పాటు డెంగ్యూ చాలా దారుణంగా ఉందని పేర్కొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
