Meenakshi Chaudhary Chiranjeevi Movie
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు కొల్లి బాబీ కలయికలో రాబోతున్న వర్కింగ్ టైటిల్ మెగాస్టార్ 158. వీరిద్దరూ ఒకసారి వాల్తేరు వీరయ్యకు కలిసి పనిచేశారు. బాబీ మరోసారి చిరుతో చేసే చాన్స్ అందుకున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా పూర్తి చేసే పనిలో మేకర్స్ ఉన్నారు. ఈ మూవీ నుంచి ఒక అనౌన్స్ మెంట్ వచ్చింది.
* సెకెండాఫ్ లోనే మెరిసేది..
సంక్రాంతికి వస్తున్నాం హీరోయిన్ మీనాక్షి చౌదరి మెగాస్టార్ 158తో కలిసి యాక్ట్ చేస్తారని ఫిల్మ్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఆమె కనిపించేది కొంతసేపే అని, అది కూడా సెకెండాఫ్ లోనే సీన్స్ ఉంటాయని తెలుస్తోంది. చిరు సరసన పూర్తి స్థాయిలో ఏ హీరోయిన్ నటిస్తారు అనేది మేకర్స్ ఇంకా అనౌన్స్ మెంట్ చేయలేదు. చిరు బర్త్ డే ఈనెల 22 న ఆరోజు ప్రకటన వస్తుందేమో చూడాలి.
* బిజిబిజీగా మీనాక్షి
నటి మీనాక్షి చౌదరి అనిల్ రావిపూడి సినిమా సంక్రాంతికి వస్తున్నాంలో నటించారు. మెగాస్టార్ చిరంజీవి, అనిల్.. శివశంకరవరప్రసాద్ గారు మూవీకి కలిసి పనిచేశారు. ఆయన డైరెక్షన్ లో ఇద్దరు వేర్వేరు సినిమాల్లో నటించారు. ఇప్పుడు చిరు, మీనాక్షి కలిసి మెగాస్టార్ 158లో నటించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నాగచైతన్య మూవీ వృషకర్మలో మీనాక్షి యాక్ట్ చేస్తున్నారు. తదుపరి కార్తీతో ఓ సినిమాతో పాటు వెబ్ సిరీస్ లో చేయనున్నారు. ఇందులో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా వెంకీ అట్లూరి డైరెక్షన్ లో ఈ సిరీస్ రాబోతోంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
