Peddi Sudarshan Reddy Statue
* విగ్రహ గద్దె కూల్చివేత దుర్మార్గం
ఆకేరు న్యూస్, వరంగల్: నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, దివంగత పెద్ది సుదర్శన్‌రెడ్డి లేని లోటు పూడ్చలేనిదని మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. పెద్ది సుదర్శన్‌రెడ్డి జ్ఞాపకార్థం సోమవారం కాజీపేట చౌరస్తాలో కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా దాస్యం వినయ్ భాస్కర్ పెద్ది సుదర్శన్‌రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పెద్ది సుదర్శన్‌రెడ్డితో కలిసి తాను అనేక పోరాటాల్లో పాల్గొన్నానని ఆయన గుర్తుచేశారు. ఉద్యమ సమయంలో పెద్ది చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.
పెద్ది సుదర్శన్‌రెడ్డి మరణం తీరని లోటని వినయ్ భాస్కర్ పేర్కొన్నారు. నర్సంపేటలో ఆయన విగ్రహం ఏర్పాటు కోసం నిర్మించిన గద్దెను కూల్చివేయడం దుర్మార్గమైన చర్య అని ఆయన విమర్శించారు.
పెద్ది సుదర్శన్‌రెడ్డి సేవలను గుర్తిస్తూ ఆయన విగ్రహాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని వినయ్ భాస్కర్ డిమాండ్ చేశారు. విగ్రహ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
