Balakrishna Koratala Siva Movie
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : బాలకృష్ణ హీరోగా కొరటాల శివ డైరెక్షన్ లో ఒక సినిమా రాబోతున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం బాలయ్య మోకాలికి గాయమైంది. దీంతో ఈనెల మూడో వారం నుంచి షూట్ జరగాల్సి ఉండగా వాయిదా వేసి.. సెప్టెంబర్ రెండో వారం నుంచి ప్రారంభించనున్నారు. బాలయ్య లేని సన్నివేశాలను తీయబోతున్నారని తెలుస్తోంది. 15 రోజులకు పైనే షూట్ చేస్తారని తెలుస్తోంది. దేవర తర్వాత శివ డైరెక్షన్ లో వస్తున్న సినిమా కావడంతో చాలా ప్రతిష్టాత్మకంగా తీయనున్నారు. కుటుంబ బంధాలపై హృదయాలను కదిలించే సన్నివేశాలు పూర్తిగా ఆడియన్స్ ను కట్టిపడేస్తాయని ఫిల్మ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. శివ ఈ స్టోరీ కోసం బాగా కసరత్తు చేశారట.
* ఇప్పుడు అబ్బాయ్ .. ఇప్పుడు బాబాయ్
కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన సినిమా దేవర. ఇందులో హీరోగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ యాక్ట్ చేశారు. ఇది బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. అబ్బాయ్ తారక్ కు ఒక సూపర్ హిట్ ఇచ్చారు.
ఇదే ఉత్సాహంతో దేవర పార్ట్ 2 కూడా ఉన్నట్లు దేవర పార్ట్ 1 ఎండింగ్ లో హింట్ ఇచ్చారు. ప్రస్తుతం ఎన్టీఆర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ లో యాక్ట్ చేస్తున్నారు. మరో వైపు శివ ..బాబాయ్ బాలయ్య బాబుతో సినిమా చేస్తున్నారు. ఇలా అబ్బాయ్ బాబాయ్ లను డైరెక్షన్ చేసే అవకాశం దక్కించుకున్నారు.
* ఇద్దరికీ గాయాలయ్యాయి..
బాలకృష్ణ తన తదుపరి చిత్రం ఎన్ బీకే 111 షూటింగ్ చేస్తు్న్న సమయంలో ఎడమ మోకాలికి గాయమైంది. 2026 జూలై 21న కాకినాడ డీప్-సీ పోర్ట్‌లో మంచు మనోజ్‌తో కలిసి ఒక కీలకమైన యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నప్పుడు కిందపడ్డారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా షూటింగ్ చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ భూజానికి గాయమైంది. ఆరు నుంచి ఎనిమిది వారాల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
