Janhvi Kapoor OTT Debut
ఆకేరు న్యూస్, హైదరాబాద్ :
బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జాన్వీ కపూర్ ఇప్పుడు ఓటీటీ ప్రపంచంలోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారనే వార్తలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇప్పటికే ఆమె పలు భిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకోగా, డిజిటల్ ప్లాట్ఫామ్లో మరింత విభిన్నమైన కథతో కనిపించనున్నారనే ప్రచారం సాగుతోంది. ఇటీవల దక్షిణాది సినిమాలపై కూడా జాన్వీ దృష్టి పెట్టడంతో ఆమె తదుపరి ప్రాజెక్టులపై అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.
* పెద్దితో దక్షిణాది ప్రేక్షకులకు చేరువ
ఇప్పటికే జాన్వీ దక్షిణాది చిత్రాల్లోనూ తన మార్క్ చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. రామ్ చరణ్‌తో నటించిన ‘పెద్ది’ వంటి ప్రాజెక్టులతో దక్షిణాది ప్రేక్షకులకు మరింత చేరువైన ఆమె, ఓటీటీ ఎంట్రీతో తన పరిధిని మరింత విస్తరించాలనే ప్రయత్నంలో ఉన్నట్లు కనిపిస్తోంది. వెండితెరపై మెరిసిన ఈ యువ కథానాయిక డిజిటల్ తెరపై ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి.
* వెబ్ సిరీస్.. కురత్తి
ఈ వెబ్ సిరీస్ కు కురత్తి అనే టైటిల్ కాన్ఫాం చేశారు. సమాజంలోని వివక్ష, అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడే ఒక సామాన్య మహిళ గా కనిపించబోతున్నారు. ఇందులో జాన్వీ కపూర్ తన రెగ్యులర్ గ్లామర్ ఇమేజ్‌కు భిన్నంగా, నటనకు ఎంతో ప్రాధాన్యమున్న ఒక బలమైన గ్రామీణ మహిళగా డిగ్లామరైజ్డ్ పాత్రలో కనిపిస్తారు. ఇంకొక విషయం ఏమిటంటేఈ సిరీస్ ప్రముఖ దర్శకుడు పా. రంజిత్ నిర్మాణంలో, సర్గుణం దర్శకత్వంలో తెరకెక్కుతుంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
