Suriya Acting Journey
* సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ :
తమిళ స్టార్ హీరో సూర్య తన సినీ ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తాను మొదట్లో నటుడిగా మారాలని అనుకోలేదని, కుటుంబంలో నెలకొన్న ఆర్థిక ఇబ్బందుల కారణంగానే సినిమాల్లోకి అడుగుపెట్టాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. పరిస్థితులు తనను నటన వైపు నడిపించాయని, ఆ నిర్ణయమే తన జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని సూర్య చెప్పినట్లు సమాచారం.
* 14న విశ్వనాథ్ అండ్ సన్స్ విడుదల
తమిళ స్టార్ హీరో సూర్య కొత్త చిత్రం విశ్వనాథ్ అండ్ సన్స్ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ ఫ్యామిలీ డ్రామాలో సూర్యతో పాటు మమితా బైజు, రవీనా టాండన్, రాధికా శరత్‌కుమార్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నిర్మాత సితార ఎంటర్టైన్మెంట్స్ విడుదల చేసిన ఓ ఇంటర్వ్యూలో సూర్య సినిమా గురించి, తన సహనటుల గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
* ఐదు రోజుల ముందే తెలిసింది..
“కార్తీకి చిన్నప్పటి నుంచే సినిమాల్లోకి రావాలనే ఆసక్తి ఉండేది. కానీ నేను కెమెరా ముందుకు వెళ్లాల్సి వస్తుందని షూటింగ్‌కు కేవలం ఐదు రోజుల ముందు మాత్రమే తెలిసింది. ఎలాంటి ముందస్తు సిద్ధత లేకుండానే కెమెరా ముందే నటనలో ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. మొదట్లో సంపాదించి అమ్మకు డబ్బులు ఇవ్వాలనే ఉద్దేశంతోనే నటించాను. అయితే తెరపై నేను తప్పులు చేసినా, తడబడినా ప్రేక్షకులు నాపై చూపించిన అపారమైన ప్రేమ నన్ను మరింత బాధ్యతగా తీసుకునేలా చేసింది. అలా క్రమంగా సినిమాపై నాకు ఆసక్తి పెరిగి, నటన నా బాధ్యతగా మారింది” అని సూర్య వెల్లడించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
