Hyderabad Cultural Festival 2026 poster launch
* ఈనెల 16న రవీంద్రభారతి వేదికగా నిర్వహణ
* వాల్ పోస్టర్ ఆవిష్కరణ
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : సామాజిక, సాంస్కృతిక సేవా సంస్థ హైదరాబాద్ జిందాబాద్ నిర్వహణలో కల్చరల్ ఫెస్ట్ నిర్వహించనున్నారు. సమాజంలో సుహృద్భావ వాతావరణాన్ని పెంపొందించడం, విభిన్న ప్రాంతాల కళారూపాలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ వేడుకలను నిర్వహించారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రవీంద్ర భారతిలోని సంచాలకుడు కార్యాలయంలో ఈ కల్చరల్ ఫెస్ట్ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన గోడ పత్రిక ను డాక్టర్ ఏనుగు నరసింహా రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడారు.
* భిన్న సంస్కృతుల నిలయం – ఏనుగు నరసింహారెడ్డి
హైదరాబాద్ మహా నగరం భిన్న సంస్కృతుల నిలయమని రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు డాక్టర్ ఏనుగు నరసింహా రెడ్డి అన్నారు. నిజామ్ పాలన నుంచి జంట నగరాలు లో హిందూ ముస్లిం క్రిస్టియన్ సిక్కు జైన ఇతర మతాల వారు మధ్య స్నేహ భావాలు ఉండేవని ఆయన వెల్లడించారు. హైదరాబాద్ జిందాబాద్ నిర్వహణలో కల్చరల్ ఫెస్ట్ 2026 ఈ నెల 16 వ తేదీన చేపట్టనుండడం ఆసక్తికర పరిణామం అన్నారు. సంస్కృతికి అద్దం పట్టేలా సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించాలనీ సూచించారు.
* ఏటా కల్చరల్ ఫెస్ట్ – కె.వీరయ్య
రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో హైదరాబాద్ జిందాబాద్ ప్రధాన కార్యదర్శి కె వీరయ్య మాట్లాడుతూ 2018నుంచి ప్రతి సంవత్సరం కల్చరల్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రదర్శనలు ముఖ్యం గా భిన్న సంస్కృతుల్ని ప్రతిబింబించే విధంగా భారత రాజ్యాంగ స్పూర్తికి అనుగుణంగా ఉంటాయి అని తెలిపారు. ప్రఖ్యాత కళాకారులు పేరడీ గురుస్వామి రవూఫ్ స్టాండ్ ఆఫ్ కామెడీ చొక్కాపూ రమణ మాజిక్ మౌనిక పెప్పటి షో క్రాంతికార్ రామడుగు వసంత్ తదితరులు ప్రదర్శనలు వుంటాయి అని చెప్పారు. వీటితో పాటు ది ట్రయల్ ఆఫ్ భగత్ సింగ్ సే నో టు డ్రగ్స్ అవయవ దానం వంటి సామాజిక అంశాల కూడిన స్కిట్ లు నృత్యాలు పాటలు తో హైదరాబాద్ జిందాబాద్ వేదిక ను సందడి చేయనుంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
