Actress Samantha, action scenes
ఆకేరు న్యూస్, హైదరాబాద్ :
మా ఇంటి బంగారం సక్సెస్ ను నటి సమంత ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో తన పాత్ర, యాక్షన్ సన్నివేశాల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. హీరోయిన్లు కూడా యాక్షన్ సన్నివేశాలను ధైర్యంగా చేయగలరని నిరూపించాలనేదే తన లక్ష్యమన్నారు.
* యాక్షన్ సీన్స్ చేస్తే.. త్వరగా అంగీకరించరనే
సాధారణంగా మహిళలు యాక్షన్ సీన్స్ చేస్తే ప్రేక్షకులు అంత త్వరగా అంగీకరించరనే అభిప్రాయం ఉందని సమంత అన్నారు. ఆ ఆలోచనా విధానాన్ని మార్చాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. మహిళలు కూడా పురుషులతో సమానంగా సాహసోపేతమైన యాక్షన్ సన్నివేశాల్లో నటించగలరని నిరూపించాలనుకుంటున్నానని పేర్కొన్నారు.
* ఆ సీన్లలో కష్టాలను ఆస్వాదించా
‘మా ఇంటి బంగారం’లో యాక్షన్ సన్నివేశాలు చేయడం తనకు ప్రత్యేకమైన అనుభూతిని ఇచ్చిందని సమంత తెలిపారు. షూటింగ్ సమయంలో దెబ్బలు తింటూ కూడా ఫైట్స్ చేయడం తనకు ఎంతో కిక్ ఇచ్చిందని చెప్పారు. యాక్షన్ సీన్లలో ఎదురయ్యే కష్టాలను ఆస్వాదిస్తూ పనిచేశానని వెల్లడించారు. కుటుంబ నేపథ్యంతో సాగే కథలో యాక్షన్ అంశాలకు కూడా ప్రాధాన్యం ఇచ్చారని, అందుకే తన చిత్రాల్లో మా ఇంటి బంగారం అంటే తనకు ఎంతో ఇష్టమని వ్యాఖ్యానించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
