Megastar Chiranjeevi, mega 158 title leak
ఆకేరు న్యూస్, హైదరాబాద్ :
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘మెగా 158’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ‘వాల్తేరు వీరయ్య’తో మెగా అభిమానులకు మాస్ ట్రీట్ ఇచ్చిన ఈ కాంబో.. మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ఈ సినిమాకు ‘కదిరి’ అనే టైటిల్‌ను చిరంజీవి స్వయంగా లీక్ చేయడంతో సినీ వర్గాల్లో ఆసక్తి మరింత పెరిగింది.
* అనుకోకుండా టైటిల్ వెల్లడి
ఇటీవల ‘కొరియన్ కనకరాజు’ సక్సెస్ మీట్లో మాట్లాడిన చిరంజీవి.. తన 158వ సినిమా టైటిల్ ‘కదిరి’ అని అనుకోకుండా వెల్లడించినట్లు సమాచారం. అంతేకాకుండా తన పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయనున్నట్లు కూడా ఆయన చెప్పినట్లు వార్తలు వచ్చాయి. అయితే ‘కదిరి’ అనే టైటిల్‌ను చిత్రబృందం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
* ఈ లీక్ నిజమేనా?
‘వాల్తేరు వీరయ్య’ తర్వాత చిరంజీవి–బాబీ కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా కావడంతో ‘కదిరి’పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా చిరంజీవి మాస్ ఇమేజ్‌కు తగ్గట్టుగా బాబీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. టైటిల్‌పై చిరు ఇచ్చిన లీక్ నిజమేనా? ‘కదిరి’ పేరుతోనే సినిమా అధికారికంగా ప్రకటిస్తారా? అన్నది తెలియాలంటే చిత్రబృందం అధికారిక ప్రకటన వరకు వేచి చూడాల్సిందే. ఈ సినిమాలో అనస్వర రాజన్ , నివేదా పేతురాజ్‌తో పాటు మరికొందరు కీలక నటులు కూడా సినిమాలో భాగమవుతున్నట్లు సమాచారం. నారా రోహిత్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నట్లు కూడా వార్తలు వెలువడ్డాయి.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
