Kishtapur Mutyalamma Bonalu
* కిష్టాపురంలో గ్రామములో వైభవంగా ముత్యాలమ్మ బోనాల వేడుకలు
* శోభాయాత్రలో బోనమెత్తి మొక్కులు చెల్లించిన సర్పంచ్ కొండం రంగారెడ్డి, ఉప సర్పంచ్ తోట సోమ నరసయ్య,
ఆకేరు న్యూస్,రాయపర్తి: మండలంలోని కిష్టాపురం గ్రామంలో ముత్యాలమ్మ బోనాల పండుగ వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలు, ఉత్సాహభరిత వాతావరణంలో వైభవంగా జరిగాయి. ఈ పండుగను పురస్కరించుకొని గ్రామమంతా ముస్తాబయి పండుగ శోభ సంతరించుకుంది. పండుగ సందర్భంగా గ్రామ సర్పంచ్ కొండం రంగారెడ్డి, ఉప సర్పంచ్ తోట సోమ నరసయ్య, మరియు వార్డు సభ్యులు కేమిడి యాదయ్య, గిద్దె వెంకటయ్య, తాళ్లపల్లి శోభన్ బాబు,షెవునబోయిన పద్మ, ఈదు నూరి కళ్యాణి, గిద్దె రజిత,మిగతా వార్డు సభ్యులు మాజీ గ్రామ సర్పంచ్ సంకినేని ఉప్పలమ్మా, నవీన్,ఉప సర్పంచ్ కత్తి సుజాత, రవీందర్, ప్రత్యేక శ్రద్ధతో శోభాయాత్రలో పాల్గొని,బోన మెత్తుకొని ఊరేగింపుగా వెళ్ళి
అమ్మవారికి భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజల్లో సర్పంచ్ కొండం రంగారెడ్డి, ఉప సర్పంచ్ తోట సోమనర్సయ్య, మాజీ సర్పంచ్ సనికినేని ఉప్పలమ్మ నవీన్ పాల్గొని గ్రామ ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా
వారు మాట్లాడుతూ… గ్రామ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, అమ్మవారి దయతో ఊరిలో పంటలు సమృద్ధిగా పండి పాడిపంటలతో గ్రామం వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ప్రశాంత వాతావరణంలో, భక్తిపారవశ్యంతో పండుగను నిర్వహించుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
అమ్మవారి శోభాయాత్రలో పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల సిగాలు, డప్పు చప్పుళ్లు మార్మోగాయి. మహిళలు నిష్టతో తయారు చేసిన బోనాలను నెత్తిన ఎత్తుకొని అమ్మవారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ముఖ్య వివిధ పార్టీల నాయకులు ప్రజాప్రతినిధులు, వివిధ వర్గాల నాయకులు, వార్డు సభ్యులు, గ్రామ యువత మరియు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు.


Please tell us what is wrong. Your report will be sent to the website team.
