Hyderabad Auto Drivers Protest
* హైదరాబాద్లో ఆటోడ్రైవర్ల ఆందోళన
* ఆర్టీసీలో ఎలక్ర్టిల్ ఆటోల నిర్ణయంపై ఆగ్రహం
* ఉపసంహరించుకోవాలని డిమాండ్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ :
‘ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. ఆర్టీసీ బస్సులలో మహిళలకు మహాలక్ష్మి పథకం తీసుకువచ్చి ఆటోకార్మికుల పొట్ట కొట్టారు. ఇది చాలదన్నట్లు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఆర్టీసి ఆధ్వర్యంలో ఎలక్ర్టికల్ ఆటోలను తీసుకువచ్చే యోచనలో ప్రభుత్వం ఉంది. దీనివల్ల కార్మికుల జీవితాలు మరింత దుర్భరంగా మారే ప్రమాదం ఉంది’ అని ఆటోడ్రైవర్లు వాపోతున్నారు. మహాలక్ష్మితో మా పొట్ట కొట్టింది చాలదా? అని ప్రశ్నిస్తున్నారు.
* ఇందిరాపార్కు వద్ద ధర్నా
ఆర్టీసీలో ఎలక్ర్టిల్ ఆటోల నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ రక్షణ సేన పార్టీ కార్మిక విభాగం ఆధ్వర్యంలోని టీఆర్టియు తెలంగాణ ఆటోకార్మిక సంఘం నేతృత్వంలో ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో నగరవ్యాప్తంగా ఆటో డ్రైవర్లు పెద్ద సంఖ్యలో హాజరై ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్టీసీతో అనుసంధానంగా ప్రభుత్వం ప్రవేశపెట్టే ఎలక్ర్టికల్ ఆటోల నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
* కార్మికులను నిండా ముంచే ప్రయత్నమా?
టీఆర్టియు తెలంగాణ రక్షణ సేన కార్మిక విభాగం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు రూప్సింగ్, రాష్ట్ర అధ్యక్షుడు ఎం సలీమ్లు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఆటోడ్రైవర్లకు ఏడాది 12వేల జీవన భృతి, కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటు తదితర హామీలను విస్మరించిందని వారు మండి పడ్డారు. ఆటోడ్రైవర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నూతనంగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసిలో ఎలక్ర్టికల్ ఆటోలు తీసుకువచ్చి ఆటోడ్రైవర్లను నిండా ముంచే ప్రయత్నం చేస్తుందని వారు ఆరోపించారు. ఆటోడ్రైవర్ల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం తీసుకున్న ఎలక్ర్టికల్ ఆటోలను తీసుకువచ్చే నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో నగరవ్యాప్తంగా ఉన్న ఆటోడ్రైడర్లు పెద్ద ఎత్తున ఉద్యమాలను ఉధృతం చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని పిలుపునిచ్చారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
