Trisha Salutes Vijay
ఆకేరు న్యూస్, హైదరాబాద్:
తమిళనాడు ముఖ్యమంత్రి, సినీ నటుడు విజయ్ తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. చెన్నైలోని ఫోర్ట్ సెయింట్ జార్జ్‌లో శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, అధికారులు పాల్గొన్నారు. అయితే ఈ వేడుకల్లో నటి త్రిష కృష్ణన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
* సోషల్ మీడియాలో వైరల్
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు త్రిష తన తల్లి ఉమా కృష్ణన్‌తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె సీఎం విజయ్ తల్లిదండ్రులు ఎస్.ఏ. చంద్రశేఖర్, శోభా చంద్రశేఖర్‌ల పక్కనే ముందు వరుసలో కూర్చున్నారు. దీంతో ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. త్రిష పసుపు..ఆరెంజ్ షేడ్ సిల్క్ చీరలో సంప్రదాయ లుక్‌లో కనిపించగా.. ఆమె ఫొటోలు, వీడియోలను అభిమానులు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు.
* మరోసారి చర్చనీయాంశంగా విజయ్, త్రిష
విజయ్, త్రిష గతంలో పలు సినిమాల్లో కలిసి నటించారు. ముఖ్యంగా ‘లియో’లో వీరిద్దరి జోడీకి మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు విజయ్ రాజకీయాల్లోకి వచ్చి తమిళనాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగిన తొలి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో త్రిష కనిపించడంతో మరోసారి వీరిద్దరి గురించి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. అయితే ఈ కార్యక్రమంలో త్రిష హాజరు కావడం, విజయ్ తల్లిదండ్రుల పక్కన కూర్చోవడం వంటి విషయాలపైనే ప్రస్తుతం ప్రధానంగా అభిమానులు, నెటిజన్లు స్పందిస్తున్నారు.
* విజయ్ జీపులో వెళ్తున్న సమయంలో సెల్యూట్
ఈ వేడుకల్లో చోటుచేసుకున్న ఓ ఆసక్తికర దృశ్యం ఇప్పుడు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. అధికారిక కార్యక్రమాల్లో భాగంగా విజయ్ జీపులో వెళ్తున్న సమయంలో.. ఆయనను చూసిన త్రిష సెల్యూట్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విజయ్ అధికారిక విధుల్లో భాగంగా జీపులో వెళ్తుండగా త్రిష సెల్యూట్ చేయడం, ఆమె స్పందించిన తీరు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో ఈ వీడియోను అభిమానులు, నెటిజన్లు విస్తృతంగా షేర్ చేస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
