CM Revanth announces mulugu parkal developments
* మేడారం అంతర్జాతీయ పర్యాటక క్షేత్రంగా మారుస్తాం
– సీఎం రేవంత్రెడ్డి
ఆకేరు న్యూస్ ములుగు/ పరకాల :
ములుగు, పరకాల ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తుందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించిన సీఎం మేడారంలో సమ్మక్క–సారలమ్మలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ములుగు, పరకాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మేడారం నుంచే కొత్త చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. అర్హులైన వితంతువులు, ఒంటరి మహిళలకు మంజూరు పత్రాలు అందజేశారు. మేడారాన్ని అంతర్జాతీయ స్థాయి పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. అనంతరం ములుగు జిల్లా కేంద్రానికి చేరుకున్న సీఎం రూ.63.50 కోట్లతో నిర్మించిన నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని ప్రారంభించారు. జిల్లాలో సుమారు రూ.868 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.
గ్రామీణ రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం భారీ ప్రణాళిక రూపొందించిందని రేవంత్రెడ్డి తెలిపారు. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ విధానంలో రాష్ట్రవ్యాప్తంగా రూ.16 వేల కోట్లకు పైగా వ్యయంతో రహదారులను అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. తొలి దశలో 7,448 కిలోమీటర్ల మేర 2,145 రహదారులను అభివృద్ధి చేయడం ద్వారా 3,036 గ్రామ పంచాయతీలకు ప్రయోజనం కల్పించనున్నారు. రహదారి సౌకర్యం లేని 176 గ్రామ పంచాయతీలకు కొత్తగా బీటీ రోడ్ల అనుసంధానం కల్పించనున్నారు.
* పరకాలలో ప్రారంభోత్సవాలు
అనంతరం పరకాల నియోజకవర్గానికి చేరుకున్న సీఎం వందల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. పరకాల పట్టణంలో తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, ఆసుపత్రి భవనం, డిగ్రీ కళాశాల, విద్యుత్ సబ్స్టేషన్లు, ఫోర్లేన్ రహదారి, ఉర్దూఘర్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ తదితర ప్రాజెక్టులను చేపట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆత్మకూరు మండలం అక్కంపేటను ఆదర్శ గ్రామంగా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేకంగా నిధులు కేటాయించింది.గ్రామీణ ప్రాంతాలకు మౌలిక వసతులు కల్పించడం, విద్య, వైద్యం, రహదారులను మెరుగుపరచడం ద్వారా అభివృద్ధి ఫలాలను అన్ని ప్రాంతాలకు విస్తరించడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం పేర్కొన్నారు
—————————————-

Please tell us what is wrong. Your report will be sent to the website team.
