SaV3 Telugu Movie
ఆకేరు న్యూస్, హైదరాబాద్:
మాస్, లవ్, అండ్ లైఫ్ ఎమోషనల్ ఎలిమెంట్స్‌తో కూడిన డిఫరెంట్ కాన్సెప్ట్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘సాV3’. సామ్రాట్, డీమోన్ పవన్, లిఖిత (రాను బొంబాయికి రాను సాంగ్ ఫేమ్) ప్రధాన తారాగణంగా నటిస్తున్న ఈ సినిమాకు నటుడు, దర్శకుడు కృష్ణ మాయ దర్శకత్వం వహిస్తున్నారు. లక్ష్మి కృష్ణ ఫిలింస్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.2గా నిర్మాత వి. విజయ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
అన్ని నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో, ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో ‘సాV3’ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ అత్యంత వైభవంగా జరిగింది. టాలీవుడ్ ప్రముఖులు, పలువురు బిగ్ బాస్ సెలబ్రిటీలు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి చిత్ర యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. ఈ వేడుకలో చిత్ర బృందం సినిమా విశేషాలను పంచుకుంది.
* టీజర్ లాంచ్ వేడుకలో ప్రముఖుల మాటలు..
సింగర్, బిగ్ బాస్ ఫేమ్ రాము రాథోడ్: “సాV3 సినిమా టీజర్ నాకు విపరీతంగా నచ్చింది. సామ్రాట్, లిఖిత, డీమోన్ పవన్ తమ పెర్ఫార్మెన్స్‌లతో ఒకరికొకరు పోటీపడి నటించారు. ఈ సినిమాలో వాళ్ల నటన స్క్రీన్ పై హైలైట్ అవుతుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.”
నటుడు సంజయ్ తుమ్మ: “ఈ చిత్ర టీజర్ చాలా ప్రామిసింగ్‌గా ఉంది. డైరెక్టర్ కృష్ణ మాయ మరియు టెక్నికల్ టీమ్ అందరికీ నా అభినందనలు. నేను డీమోన్ పవన్ నటనకు వీరాభిమానిని. ఫ్యూచర్లో అతను మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బాబు, నానిల రేంజ్లో ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకుంటాడని గట్టిగా నమ్ముతున్నాను.”
నటి హారిక: “ఈ సినిమాలో నాదొక కీలకమైన, ప్రాధాన్యత ఉన్న పాత్ర ఉంది. నాపై నమ్మకంతో ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు కృష్ణ మాయ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఆయనకు సినిమాపై ఉన్న ప్యాషన్ మాటల్లో చెప్పలేం. ఉదయం నుంచి రాత్రి వరకు అదే ఎనర్జీతో పని చేస్తారు. సామ్రాట్ తన క్యారెక్టర్లో కేవలం నటించలేదు, పూర్తిగా జీవించేశాడు.”
నటి రీతు చౌదరి: “ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఈవెంట్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ‘సాV3’ టీజర్ లవ్ అండ్ లైఫ్ కాన్సెప్ట్‌తో ఎంతో ఆకట్టుకునేలా ఉంది. జీవితంలో కష్టాలు ఎలా ఉంటాయో, ప్రేమలోనూ అలాగే ఉంటాయి. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ సాగే కథ ఇది.”
ప్రొడక్షన్ అశోక్ కుమార్: “కృష్ణ మాయ సినిమా పట్ల అంకితభావం ఉన్న టెక్నీషియన్. నా గత సినిమాలకు ఆర్ట్ డైరెక్టర్‌గా, నటుడిగా ఎంతో కష్టపడి పనిచేశారు. పవన్ లుక్స్ చూస్తుంటే దుల్కర్ సల్మాన్ లా అనిపిస్తారు. ఈ సినిమా ఆయన కెరీర్‌కు మంచి బ్రేక్ ఇస్తుంది.”
హీరో డీమోన్ పవన్: “మా టీజర్ లాంచ్‌కు విచ్చేసిన అతిథులందరికీ ధన్యవాదాలు. దర్శకుడు కృష్ణ మాయ గారి విజన్ అద్భుతం. ప్రేక్షకులందరినీ సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెట్టే ఒక చక్కటి ఎంగేజింగ్ మూవీని ఆయన మాకు అందించారు. కో-ఆర్టిస్ట్స్ అందరితో పనిచేయడం అద్భుతమైన అనుభూతినిచ్చింది.”
హీరోయిన్ లిఖిత: “ఈ కథ వింటున్నప్పుడే ఇందులో నటించాలనిపించింది. డైరెక్టర్ గారు మమ్మల్ని పూర్తిగా క్యారెక్టర్లలో ఇన్వాల్వ్ చేసి నటింపజేశారు. ఈ సినిమా బిగినింగ్ నుంచి ఎండ్ వరకు మిమ్మల్ని కట్టిపడేస్తుంది. ప్రేక్షకుల నుంచి గొప్ప ఆదరణ లభిస్తుందనే నమ్మకం ఉంది.”
హీరో సామ్రాట్: “ఇప్పటివరకు నన్ను లవర్ బాయ్, చాక్లెట్ బాయ్ పాత్రల్లోనే ఎక్కువగా చూశారు. కానీ, ఈ చిత్రంలో త్రివిక్రమరాజు అనే డిఫరెంట్ రోల్లో కనిపిస్తాను. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా నాకు కచ్చితంగా ఒక రీలాంఛ్ లాంటిది. ప్రేక్షకులు నన్ను ఈ కొత్త కోణంలో ఖచ్చితంగా ఇష్టపడతారు.”
నిర్మాత వి. విజయ: “సుధావల్లి, నాగవర్థినిల సహకారంతో ఈ చిత్రాన్ని అత్యుత్తమ విలువలతో నిర్మించాము. అందరి సహకారంతో ఇలాంటి మంచి చిత్రాలు మరిన్ని భవిష్యత్తులోనూ ప్రొడ్యూస్ చేయాలని కోరుకుంటున్నాను.”
దర్శకుడు కృష్ణ మాయ: “రామ్ గోపాల్ వర్మ, మణిరత్నం గారి వద్ద వర్క్ చేసినప్పుడు నేను దర్శకత్వ మెలకువలు నేర్చుకున్నాను. మా ఆర్టిస్టులు సామ్రాట్, పవన్, లిఖిత ముగ్గురూ ప్రాణం పెట్టి నటించారు. ముఖ్యంగా క్లైమాక్స్ లో సామ్రాట్ పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఇది కేవలం టీజర్ మాత్రమే, సినిమాలో ఇంకా బలమైన స్ట్రాంగ్ కంటెంట్ ఉంది. త్వరలోనే గ్రాండ్ రిలీజ్‌తో మీ ముందుకు వస్తాం.”
సాంకేతిక నిపుణుల వివరాలు…
బ్యానర్: లక్ష్మి కృష్ణ ఫిలింస్ (ప్రొడక్షన్ నెం.2)
నిర్మాత: వి. విజయ
కథ, స్క్రీన్ ప్లే, ఆర్ట్ డైరెక్షన్, దర్శకత్వం: కృష్ణ మాయ
సంగీతం: సాయి కార్తీక్
సినిమాటోగ్రఫీ (డీవోపీ): పవన్ మణి
ఎడిటర్: శివ శర్వాణి
స్టంట్స్: అఖిల్

Please tell us what is wrong. Your report will be sent to the website team.
