Mega 158 Special Song
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు మరోసారి విజువల్ ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. తన తాజా చిత్రం మెగా 158లో స్పెషల్ సాంగ్ కోసం చిరంజీవి సరికొత్త స్టైలిష్ లుక్‌లో కనిపించనున్నారనే వార్తలు సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో భారీ యాక్షన్ షెడ్యూల్ కొనసాగుతోంది. రామ్–లక్ష్మణ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో యాక్షన్ సీన్స్‌ను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.
* వచ్చేవారం నుంచి
చిరంజీవి సినిమాల్లో పాటలకు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆయన డ్యాన్స్ స్టెప్పులు, గ్రేస్, ఎనర్జీకి భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. దీంతో స్పెషల్ సాంగ్‌లో మెగాస్టార్ స్టయిలిష్ గా కనిపిస్తారట. ముఖ్యంగా ఆయన హెయిర్‌స్టైల్, కాస్ట్యూమ్స్, స్క్రీన్ ప్రెజెన్స్ ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయట. వచ్చే వారం నుంచి చిత్రీకరణ మొదలవుతుందని సమాచారం.
* భారీగా సెట్స్.. మేకర్స్ ప్లాన్?
ఇక ఈ పాట కోసం భారీగా సెట్స్ వేసి గ్రాండ్‌గా చిత్రీకరించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు వినికిడి. చిరంజీవి స్టైల్‌కు తగ్గట్టుగా కొరియోగ్రఫీని సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. థియేటర్లలో అభిమానులతో ఈలలు వేయించే రేంజ్లో ఉండబోతోందనే అంచనాలు నెలకొన్నాయి. మెగాస్టార్ స్టైలిష్ లుక్, అదిరిపోయే డ్యాన్స్, గ్రాండ్ విజువల్స్ కలిస్తే ఈ స్పెషల్ సాంగ్ సినిమాకు మరో హైలైట్‌గా మారడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
