Sangeeth Shobhan Maruthi Look
* టైటిల్ గ్లింప్స్ డేట్ ఫిక్స్
ఆకేరు న్యూస్, హైదరాబాద్: ‘మ్యాడ్’, ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన కామెడీ టైమింగ్, గుర్తింపు తెచ్చుకుని యూత్ ఆడియెన్స్‌ను ఆకట్టుకున్న యంగ్ హీరో సంగీత్ శోభన్. ప్రస్తుతం ఆయన వరుస ప్రాజెక్ట్‌లతో ఫుల్ జోరు మీదున్నారు. శ్రీమతి శ్రావణి సమర్పణలో, ‘అంబర్‌పేట మ్యారేజ్ బ్యాండ్’, ‘ది గర్ల్‌ఫ్రెండ్’ లాంటి వైవిధ్యమైన హిట్ చిత్రాలను నిర్మించిన ‘ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్ 3గా ఓ క్రేజీ చిత్రం రూపుదిద్దుకుంటోంది.
ధీరజ్ మొగిలినేని, గిరిబాబు వల్లభనేని సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘కుమారి 21ఎఫ్’, ‘18 పేజెస్’ చిత్రాల దర్శకుడు పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నారు. సరికొత్త ట్రెండీ ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సంగీత్ శోభన్ సరసన యువ నటి అనస్వర రాజన్ హీరోయిన్గా నటిస్తోంది. ‘ఒక చిన్న విరామం’ ఫేమ్ లక్ష్మీ భూపాల్ ఈ చిత్రానికి మాటలు, కథన సహకారం అందిస్తున్నారు.
ఈ రోజు సంగీత్ శోభన్ పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక ప్రత్యేకమైన బర్త్‌డే పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్ ద్వారా సినిమాలో ఆయన పాత్ర పేరు ‘మారుతి’ అని మేకర్స్ వెల్లడించారు. పోస్టర్లో సంగీత్ శోభన్ చేతిలో ఆకుకూరల బుట్ట పట్టుకుని పక్కా మిడిల్ క్లాస్ అబ్బాయి లుక్‌లో, పొరుగింటి కుర్రాడిలా చాలా సహజంగా కనిపిస్తున్నారు. ఇలాంటి సహజసిద్ధమైన పాత్రలు, హాస్యంతో కూడిన నటన సంగీత్ శోభన్‌కు టైలర్ మేడ్‌లా సరిపోతాయని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
ఇక ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌ను ఈ నెల 23న గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ అందరినీ మెప్పించేలా ఈ కథను రూపుదిద్దుతున్నామని, త్వరలోనే సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడిస్తామని చిత్రబృందం తెలిపింది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
