Megastar Chiranjeevi, Mega 158 Movie
* 40 రోజుల్లోనే ఫస్ట్ హాఫ్ ఫినిష్..
* ఆగస్టు 22న మ్యాసివ్ అప్డేట్
ఆకేరు న్యూస్, హైదరాబాద్: బ్లాక్‌బస్టర్ చిత్రం ‘వాల్తేరు వీరయ్య’తో బాక్సాఫీస్ వద్ద విజయం సాధించిన మెగాస్టార్ చిరంజీవి, మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి (కె.ఎస్. రవీంద్ర)ల క్రేజీ కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతున్న సంగతి తెలిసిందే. వర్కింగ్ టైటిల్ #Mega158గా తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను ప్రముఖ కేవీఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions) బ్యానర్‌పై నిర్మాత వెంకట్ కె. నారాయణ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. మేకర్స్ వెల్లడించిన తాజా అప్డేట్ ప్రకారం.. ఈ సినిమా ఇప్పటికే 40 రోజుల షూటింగ్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. చిత్రీకరణ అనుకున్న ప్లాన్ ప్రకారం వేగంగా జరుగుతుండటంతో పాటు, ఫస్ట్ హాఫ్‌కు సంబంధించిన ఎడిటింగ్ వర్క్ కూడా దాదాపు పూర్తయి లాక్ అయిపోయింది.
ఇప్పటివరకు వచ్చిన రష్, అవుట్‌పుట్ పట్ల చిత్రబృందం ఎంతో సంతృప్తిగా ఉంది.
కథలో ఇంటెన్సిటీ, అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైన్మెంట్, గుండెలను హత్తుకునే ఎమోషన్, థ్రిల్లింగ్ యాక్షన్ ఎలిమెంట్స్ సరైన నిష్పత్తిలో ఉండేలా దర్శకుడు బాబీ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని మలుస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో చిత్రీకరించిన ఇంటర్వెల్ ఫైట్ సీక్వెన్స్ ఈ సినిమాకే ప్రధాన హైలైట్‌గా నిలవనుందని సమచారం. భారీ ఎత్తున డిజైన్ చేసిన ఈ మాసివ్ యాక్షన్ బ్లాక్ చిరంజీవి మార్క్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో, థియేటర్లలో ప్రేక్షకులకు, అభిమానులకు పూనకాలు తెప్పించేలా (గూస్బంప్స్) ఉండబోతోందని చిత్రబృందం తెలిపింది.
ఇక ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఒక ఊరమాస్ సర్ప్రైజ్ అప్డేట్ను ఇచ్చేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. సంక్రాంతి 2027 కానుకగా ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి తీసుకురానున్నారు.
ఈ చిత్రంలో అనస్వర రాజన్, నివేదా పేతురాజ్ కీలక పాత్రల్లో మెరవనున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఎస్ స్వరాలు అందిస్తుండగా, విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్, ఆంటోనీ ఎల్. రూబెన్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
కథనానికి పదునుపెడుతూ కోన వెంకట్, కె. చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే అందించగా, హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి అదనపు స్క్రీన్‌ప్లే రైటర్లుగా వ్యవహరిస్తున్నారు. భాను-నందు పవర్ఫుల్ డైలాగ్స్ అందిస్తుండగా, శరణ్య పోట్ల ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
